పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ | Bharath’s horror thriller Pottu gets U/A | Sakshi
Sakshi News home page

పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌

Published Fri, Sep 15 2017 3:31 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌

పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌

తమిళసినిమా: పొట్టు చిత్రం యూఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం పొట్టు. ఇందులో నటి నమిత, ఇనియ, సృష్టిడాంగే ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో తంబిమామయ్య, భరణి, నాన్‌కడవుల్‌ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్‌రామ్, షియాజీ షిండే, ఆర్యన్, స్వామినాథన్, పావా లక్ష్మణన్‌  నటించారు.

ఇంతకు ముందు మైనా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమ్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేతలు జాన్‌మ్యాక్స్, జాన్స్‌ కలిసి నిర్మించిన చిత్రం పొట్టు. వడివుడైయాన్‌ కథ, కథనం, దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌ను ముగించుకుంది. హర్రర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్‌ సభ్యులు యూఏ సర్టిఫికెట్‌ ఇచ్చారని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. పొట్టు చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement