Iniya
-
నేను హీరోయిన్గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు..
ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది. నేను పనికిరానన్నాడు ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్‌గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది. చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా -
ఆయన్ని చూసి భయపడ్డా!
తమిళసినిమా: సినీరంగంలో వారసుల రంగప్రవేశం సర్వసాధారణం. అయితే హీరోలు, దర్శక నిర్మాతల వారసులు అధికంగా వస్తున్నా, హీరోయిన్ల చెల్లెళ్లు హీరోయిన్ అవడం అరుదే. వచ్చినా నిలదొక్కుకున్న వారు తక్కువే. తాజాగా నటి ఇనియ చెల్లెలు తార కథానాయకిగా రంగంలోకి దిగింది. కిబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ అమ్మడి లక్ ఏమిటంటే ప్రముఖ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్, ఆర్.సుందర్రాజన్, ఆర్వీ.ఉదయకుమార్, మన్సూర్‌అలీఖాన్, రాజ్కపూర్అనుమోహన్ వంటి వారితో తొలి చిత్రంలోనే కలిసి నటించే అవకాశం తారను వరించడం.అంతే కాదు గాయకుడు మనో వారసుడు రతీశ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా తార నటించింది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఈ నవ కథానాయకి తెలుపుతూ కిళంబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రం పూర్తిగా వినోదభరితంగా సాగే యాక్షన్, థ్రిలర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు రజాక్ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని చెప్పింది.ప్రేక్షకులు రెండు గంటల పాటు కడుపుబ్బ నవ్వుకుంటారని చెప్పింది. ఈ చిత్రంలో తాను నటుడు మన్సూర్అలీఖాన్కు కూతురిగా నటించానని తెలిపింది. మొదట్లో ఆయన్ని చూస్తేనే భయం కలిగేదని, ఆ తరువాత మంచి ఫ్రెండ్స్ అయిపోయామని అంది. మన్సూర్ అలీఖాన్ ధైర్యం చెప్పి బాగా నటించడానికి సహకరించారని చెప్పింది. చిత్రం చివరి ఘట్టంలో తాను హీరోతో కలిసి పారిపోయే సన్నివేశం చోటు చేసుకుంటుందని తెలిపింది. ఆ సన్నివేశాలను కెమెరాలను చెట్ల చాటున పెట్టి చిత్రీకరించారని చెప్పింది. రాళ్లు, రప్పలు కలిగిన ఆ రోడ్డుపై సహజంగా ఉండాలని హీరోతో కలిసి వేగంగా పరిగెత్తానని అంది. కుక్కలు వెంట పడినప్పుడు కూడా తాను పరిగెత్తలేదని, అంతగా ఈ చిత్రం కోసం పరుగులు పెట్టానని చెప్పింది. మీకు నటనలో అక్క ఇనియ ఏమైనా సలహాలిచ్చారా? అన్న ప్రశ్నకు తమిళ భాషను చక్కగా నేర్చుకో. అప్పుడే నటిగా నిలబడగలవు అని అక్క సలహా ఇచ్చిందని అంది. మరి ఈ కిళంబిట్టాంగయ్యా కిళంబిట్టాంగయ్యా చిత్రం నవ నటి తారకు ఏ మేరకు బ్రేక్ ఇస్తుందన్నది వేచి చూడాలి. పవర్‌స్టార్ శ్రీనివాసన్, అస్మిత, విశ్వా,కన్నన్, రాజ్, దివ్య ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, శ్రీధర్ ఛాయాగ్రహణం అందించారు. హెవెన్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. -
పొట్టు చిత్రానికి యూఏ సర్టిఫికెట్
తమిళసినిమా: పొట్టు చిత్రం యూఏ సర్టిఫికెట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ హీరోగా నటించిన తాజా చిత్రం పొట్టు. ఇందులో నటి నమిత, ఇనియ, సృష్టిడాంగే ముగ్గురు హీరోయిన్లుగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో తంబిమామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్రామ్, షియాజీ షిండే, ఆర్యన్, స్వామినాథన్, పావా లక్ష్మణన్ నటించారు. ఇంతకు ముందు మైనా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాలోమ్ స్టూడియోస్ సంస్థ అధినేతలు జాన్‌మ్యాక్స్, జాన్స్ కలిసి నిర్మించిన చిత్రం పొట్టు. వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌ను ముగించుకుంది. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. పొట్టు చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. -
జయ ఆస్పత్రిలో ఉండడమే సస్పెన్స్
తమిళసినిమా: జయలలిత ఆస్పత్రిలో ఉండడమే సస్సెన్స్ అని సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. రైట్వ్యూ పతాకంపై రూపొందుతున్న చిత్రం చదుర అడి 3500. నిఖిల్మోహన్ హీరోగా పరిచయం అవుతున్న ఇందులో ఇనియ హీరోయిన్గా నటించింది. జయ్సన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్పీఎం.సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది. గణేశ్రాఘవేందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్.థాను ఆడియోను, ట్రైలర్‌ను ఆవిష్కరించగా దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ తొలిసీడీని అందుకున్నారు. కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ చిన్న చిత్రాలకు థియేటర్ల యాజమాన్యం తొలి ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఒక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. పెద్ద చిత్రాలకే ప్రాధాన్యతనివ్వాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. అలాగని చిన్న చిత్రాలకు ఉదయం ఆటలకు పరిమితం చేయరాదని, స్టార్స్ చిత్రాలకు అభిమానులు ఉదయం అయినా వస్తారని, అలా చిన్న చిత్రాలకు ప్రేక్షకులురారని అన్నారు.ఇక ఈ చదుర అడి 3500 చిత్రం చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంలా అనిపిస్తోందని, నిజానికి ఈ ఏడాదంతా సస్పెన్స్ గానే సాగుతోందని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉండడమే ఒక సస్పెన్స్ అని, ఇప్పుడు ఆగస్ట్ ఐదో తేదీన ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న వెంకయ్యనాయుడి ఎవరు మద్దతిస్తారన్నది సస్పెన్స్‌గా మారిందని అన్నారు. -
ఐటమ్ సాంగ్‌తో గౌరవమే
అవకాశాలు లేక హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారన్నది పాత మాట. అధిక పారితోషికం ఆశతో టాప్ హీరోయిన్లు కూడా అలాంటి శృంగార నృత్యాలకు సై అంటున్నారన్నది నేటి మాట. అయితే ఇనియా లాంటి అసలు విజయాలు, అంతగా అవకాశాలు లేని హీరోయిన్లు కూడా ఐటమ్స్ ఆడేస్తూ పైగా హీరోయిన్గా అవకాశాలు లేక కాదు ఆ గీతాలు నచ్చడం వల్లే అంటే వినేవారు నమ్మేస్తారా? వాగైచూడవా వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇనియా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని ఆడేస్తోంది. దీని గురించి ఈ అమ్ముడు వివరిస్తూ ప్రస్తుతం శరత్ కుమార్ సరసన వేళచ్చేరి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని తెలిపింది. తమిళంలో గ్యాప్ రాకూడదని ఇటీవల మూడు చిత్రాల్లో సింగిల్ సాంగ్స్ చేశానని చెప్పింది. రెండవదు పడం చిత్రంలో వెంకట్ ప్రభుతో స్పెషల్‌సాంగ్‌కు ఆడానని తెలిపింది. ఇందులో పాత కథానాయికల గెటప్‌లో నర్తించానని వివరించింది. ఇక పార్తిబన్ దర్శకత్వం వహించిన కథై తిరైకథై, వచనం ఇయక్కం చిత్రంలో ఆయన అడగడంతో పలువురు ప్రముఖ నటీనటుల అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో తానూ భాగం కావాలని భావించి సింగిల్ పాటలో నటించానని తెలిపింది. మూడో చిత్రం ఒరు ఊరుల రెండు రాజా దర్శకుడు కన్నన్ కోరిక మేరకు పాట కూడా నచ్చడంతో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పింది. అందుకని హీరోయిన్ అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ ఒప్పుకుంటున్నట్లు భావించరాదని, అయినా అలాంటి పాటలతోను తన గౌరవం పెరుగుతోందని ఇనియ సెలవిచ్చింది. -
ఇనియాతో చిందేస్తే సరిపోతుంది
నటి ఇనియాతో కలిసి విశాల్ చిందేస్తే చిత్రం పూర్తి అవుతుందంటున్నారు దర్శకుడు తిరు. ఇంతకుముందు విశాల్ హీరోగా తీరాద విళైయాట్టు పిళ్లై సమర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ యువ దర్శకుడు ముచ్చటగా మూడో సారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం నాన్ సిగప్పు మనిదన్. విశాల్, యూటీవీ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు పాండియనాడు వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాన్ సిగప్పు మనిధన్ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. చిత్రం గురించి దర్శకుడు తిరు మాట్లాడుతూ ఒక పాట, ఫైట్ సీక్వెన్స్ మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. విశాల్, ఇనియా, సుందర్, జగన్ పాల్గొననున్న ఈ పాటను త్వరలో మాధవరంలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు తీరాద విళైయాట్టు పిళ్లై, సమర్ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించామన్నారు. అయితే నాన్‌సిగప్పు మనిదన్ చిత్ర షూటింగ్‌ను పూర్తిగా చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. అయితే రెండు పాటలు మాత్రం రాజస్థాన్, కులుమనాలి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించడం గమనార్హం. ఈ చిత్రాన్ని తెలుగులో ఇంద్రుడు పేరుతో విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్రంలో విశాల్ పేరు ఇంద్రన్ అని అందుకే తెలుగులో ఇంద్రుడు పేరు కరెక్ట్‌గా ఉంటుందని ఆ పేరు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. -
సినిమా రివ్యూ: ట్రాఫిక్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, సూర్య (గెస్ట్ అప్పియరెన్స్) చెరన్, ప్రసన్న, పార్వతి మీనన్, ఇనియా నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్ కథ: బాబీ సంజయ్ ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్ మ్యూజిక్: మేజో జోసెఫ్ దర్శకత్వం: షాహిద్ ఖాదర్ ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం. యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది. విశ్లేషణ: పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు. -
విశాల్ సరసన ఇనియ
యువ నటి ఇనియ నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. వాగైచూడవా చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా అలాంటి మంచి అవకాశం వచ్చింది. పాండియనాడు వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం నాన్ శిగప్పు మనిదన్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రకు ఇనియను ఎంపిక చేశారు. ఇందులో ఆమెది చాలా క్రిటికల్ పాత్ర అట. కథకు కీలక పాత్ర కావడంతో రెండవ హీరోయిన్గా నటించడానికి అంగీకరించినట్లు ఇనియ పేర్కొంది. జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపింది.