జయ ఆస్పత్రిలో ఉండడమే సస్పెన్స్
తమిళసినిమా: జయలలిత ఆస్పత్రిలో ఉండడమే సస్సెన్స్ అని సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ వ్యాఖ్యానించారు. రైట్‌వ్యూ పతాకంపై రూపొందుతున్న చిత్రం చదుర అడి 3500. నిఖిల్‌మోహన్ హీరోగా పరిచయం అవుతున్న ఇందులో ఇనియ హీరోయిన్‌గా నటించింది. జయ్‌సన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌పీఎం.సినిమాస్ సంస్థ విడుదల చేయనుంది.
గణేశ్‌రాఘవేందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్.థాను ఆడియోను, ట్రైలర్‌ను ఆవిష్కరించగా దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ తొలిసీడీని అందుకున్నారు. కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ చిన్న చిత్రాలకు థియేటర్ల యాజమాన్యం తొలి ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఒక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు.
పెద్ద చిత్రాలకే ప్రాధాన్యతనివ్వాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. అలాగని చిన్న చిత్రాలకు ఉదయం ఆటలకు పరిమితం చేయరాదని, స్టార్స్ చిత్రాలకు అభిమానులు ఉదయం అయినా వస్తారని, అలా చిన్న చిత్రాలకు ప్రేక్షకులురారని అన్నారు.ఇక ఈ చదుర అడి 3500 చిత్రం చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంలా అనిపిస్తోందని, నిజానికి ఈ ఏడాదంతా సస్పెన్స్ గానే సాగుతోందని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉండడమే ఒక సస్పెన్స్ అని, ఇప్పుడు ఆగస్ట్ ఐదో తేదీన ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న వెంకయ్యనాయుడి ఎవరు మద్దతిస్తారన్నది సస్పెన్స్‌గా మారిందని అన్నారు.