ఐటమ్ సాంగ్‌తో గౌరవమే | iniya Item Song in Oru Oorla Rendu Raja movie | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్‌తో గౌరవమే

Published Tue, Aug 5 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

ఐటమ్ సాంగ్‌తో గౌరవమే

ఐటమ్ సాంగ్‌తో గౌరవమే

 అవకాశాలు లేక హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారన్నది పాత మాట. అధిక పారితోషికం ఆశతో టాప్ హీరోయిన్లు కూడా అలాంటి శృంగార నృత్యాలకు సై అంటున్నారన్నది నేటి మాట. అయితే ఇనియా లాంటి అసలు విజయాలు, అంతగా అవకాశాలు లేని హీరోయిన్లు కూడా ఐటమ్స్ ఆడేస్తూ పైగా హీరోయిన్‌గా అవకాశాలు లేక కాదు ఆ గీతాలు నచ్చడం వల్లే అంటే వినేవారు నమ్మేస్తారా? వాగైచూడవా వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఇనియా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని ఆడేస్తోంది.
 
 దీని గురించి ఈ అమ్ముడు వివరిస్తూ ప్రస్తుతం శరత్ కుమార్ సరసన వేళచ్చేరి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నానని తెలిపింది. తమిళంలో గ్యాప్ రాకూడదని ఇటీవల మూడు చిత్రాల్లో సింగిల్ సాంగ్స్ చేశానని చెప్పింది. రెండవదు పడం చిత్రంలో వెంకట్ ప్రభుతో స్పెషల్‌సాంగ్‌కు ఆడానని తెలిపింది. ఇందులో పాత కథానాయికల గెటప్‌లో నర్తించానని వివరించింది. ఇక పార్తిబన్ దర్శకత్వం వహించిన కథై తిరైకథై, వచనం ఇయక్కం చిత్రంలో ఆయన అడగడంతో పలువురు ప్రముఖ నటీనటుల అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో తానూ భాగం కావాలని భావించి సింగిల్ పాటలో నటించానని తెలిపింది.
 
 మూడో చిత్రం ఒరు ఊరుల రెండు రాజా దర్శకుడు కన్నన్ కోరిక మేరకు పాట కూడా నచ్చడంతో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పింది. అందుకని హీరోయిన్ అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ ఒప్పుకుంటున్నట్లు భావించరాదని, అయినా అలాంటి పాటలతోను తన గౌరవం పెరుగుతోందని ఇనియ సెలవిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement