ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా | Vishakha Singh at Oru Oorla Rendu Raja Audio Launched | Sakshi
Sakshi News home page

ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా

Published Wed, Aug 27 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా

ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా

 సాధారణంగా హీరోయిన్లకు ముద్దొస్తే హీరోలను చుంబిస్తుంటారు. అలా స్వకార్యం, స్వామికార్యం నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే నటి ప్రియా ఆనంద్ మాత్రం యువ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలపై ముచ్చటపడి తెగ గిల్లేసింది. నిర్మాత శాసన సభ్యుడు మైఖేల్ రాయప్పన్ తన ఇన్ఫోటెయిన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఒరు ఊరుల రెండు రాజా. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్య పాత్రను సూర్య పోషిస్తున్నారు.
 
 అతిథి పాత్రలో నటి విశాఖ సింగ్, ఐటమ్ సాంగ్‌లో నటి ఇనియా దుమ్ము రేపిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్.కన్నన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను ఈ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు కే.ఆర్., నటుడు శివకార్తికేయన్లు ఆవిష్కరించగా తొలి ప్రతిని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిథులందరూ అందుకున్నారు.
 
 కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ ప్రియా ఆనంద్ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలు గిల్లాలనే తన చిరకాల ఆశను ఈ వేదికపై తీర్చుకున్నారు. జాంగ్రీలా ఉన్నాయంటూ ఆయన బుగ్గల్ని తెగ గిల్లేసి ముద్దులు పెట్టుకోవడంతో ఆహూతులందరి దృష్టి వీరిపైనే పడింది. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్, విజయ్ సేతుపతి, విష్ణు, గౌతమ్‌కార్తిక్, నటి ఇనియా, విశాఖ సింగ్ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement