ఆయనతో నటించడం మంచి అనుభవం | namitha about superstar | Sakshi
Sakshi News home page

ఆయనతో నటించడం మంచి అనుభవం

Oct 13 2016 2:20 AM | Updated on Sep 4 2017 5:00 PM

ఆయనతో నటించడం మంచి అనుభవం

ఆయనతో నటించడం మంచి అనుభవం

సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అందాలభామ నమిత పేర్కొన్నారు.

సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అందాలభామ నమిత పేర్కొన్నారు.
ఇంతకు ముందు తనదైన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించినఈ అమ్మడు మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. అయితే మళ్లీ నటించాలన్న కోరికతో బొద్దుగా ఉన్న నమిత సుమారు 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారుఅలా కొత్త అందాలతో రెడీ అయిన నమితకు మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయనతో నటించిన పులిమురుగన్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణను అందుకుంటోంది.

 ఈ సందర్భంగా నమిత ఆ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకున్నారు.
ప్ర: మలయాళ చిత్రంలో
 నటించిన అనుభవం గురించి?
జ: నటిగా రీఎంట్రీకి రెడీ అయినప్పుడు మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. పులిమురుగన్ చిత్ర దర్శకుడు కథ వినిపించారు. అది అడ్వెచర్ కథ. అయితే ఆ కథను చెప్పినట్లుగా తెరకెక్కించగలరా? అన్న సందేహం కలిగింది. ఆ చిత్ర హీరో మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. అందుకే పులిమురుగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అందులో నా పాత్ర పేరు జూలి. ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి. అలాంటి అమ్మాయి పులిమురుగన్ గుణగణాలు మెచ్చి ఆయన్ని ప్రేమిస్తుంది. చిత్రం అంతా హీరోతో ఉంటూ ఆయనకు సహకరించే పాత్ర. మోహన్‌లాల్‌తో నటించడం చాలా మంచి అనుభవం.
ప్ర: మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలు రూపొందుతాయంటారు.పులిమురుగన్ చిత్రం అలాంటిదేనా?
జ: నిజమే మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలే రూపొందుతాయనే అపోహ ఉంది.అయితే ఈ పులిమురుగన్ 25 కోట్ల          వ్యయంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో మోహన్‌లాల్ నటన అద్భుతం అనే చెప్పాలి.
ప్ర: ఇతర చిత్రాల వివరాలు?
జ: తమిళంలో భరత్‌కు జంటగా నటిస్తున్న పొట్టు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి జానీ అనే ఆయన చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం వేచి చూస్తున్నాను. మరి కొన్ని చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.తమిళం,తెలుగు, మలయాళం భాషల్లో మరో రౌండ్ కొట్టాలని కోరుకుంటున్నాను.
ప్ర: సినిమాలు,రాజకీయాల్లో పయనించడం గురించి?
జ: రెండు వేర్వేరు వృత్తులు. ప్రజలకు ఏమైనా చేయాలని భావించాను. అందుకు తన వంతు సాయం చేస్తున్నాను. సినిమాకు,రాజకీయాలకు సంబంధం లేదు.
ప్ర: ముఖ్యమంత్రి జయలలిత గురించి?
జ: ముఖ్యమంత్రి జయలలిత ఇంతకు ముందే ఎన్నో కష్టాలను అధిగమించారు. కోట్లాదిమంది అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. కాబట్టి అమ్మ త్వరలోనే క్షేమంగా తిరిగొస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement