pulimurugan
-
పాటకు ఆస్కారం?
ఆస్కార్ ఆశలు ఇంకా చెదిరిపోలేదు. ‘న్యూటన్’ అవుట్ అయిందని బాధపడక్కర్లేదు. ఆస్కార్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈసారి బాలీవుడ్ కాదు మాలీవుడ్ సినిమా రేసులో ఉంది. బెస్ట్ ఫారిన్ చిత్రం క్యాటగిరీలో ‘న్యూటన్’ అవుట్ అయ్యాక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఓ ఇండియన్ సినిమాకి అవకాశం దక్కింది. ఆస్కార్ అవార్డ్స్ అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ ఈ సంవత్సరం ఆస్కార్ ఆవార్డ్స్ గెలిచే అవకాశం ఉన్న 70 పాటల లిస్ట్‌ను ప్రకటించింది. ఆ లిస్ట్‌లో మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్ స్వరపరచిన ‘పులిమురుగన్’లోని రెండు పాటలు (‘కాదనయుమ్ కల్చిలంబే, మానతే మారికురంబే’) స్థానం సంపాదించుకోగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్న 70 పాటల్లో పాప్ సంగీత సంచలనాలు టేలర్ స్విఫ్ట్, నిక్ జోన్స్‌తో పాటు గోపీసుందర్ సమకూర్చిన రెండు పాటలు ఉండటం విశేషం. ఈ విషయమై గోపీసుందర్ స్పందిస్తూ – ‘‘ఈ లిస్ట్‌ను మొదటిసారి చూసి నమ్మలేదు. కానీ, అకాడమీ సంస్థ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చేసరికి నమ్మక తప్పలేదు. నాకు ఇప్పటి వరకు స్టేట్ అవార్డ్ రాలేదు కానీ, నేషనల్ అవార్డ్ లభించింది. ప్రేక్షకులకు నచ్చటమే అంతిమ విజయంగా భావిస్తా’’ అన్నారు. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘పులిమురుగన్’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలై, ఇక్కడా విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్ చేరుకున్న తొలి మాలీవుడ్ మూవీగా పేరు సంపాదించింది. -
ఇదేంటీ ఇలా జరిగింది!
నటి నమిత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి యువత కలల రాణి. మచ్చాస్(బావలూ)అని నమిత అనగానే ప్రేక్షకుల నుంచి ఉత్సాహం ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది. నేటికీ బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు నమిత వస్తున్నారంటే జనం ఆమెను చూసేందుకు ఎగబడతారు. అంత క్రేజ్ ఉన్న నమిత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నారు. అయితే నమిత మాత్రం మరో ప్రయత్నం చేశారు. అదే రాజకీయరంగం ప్రవేశ నిర్ణయం. అయితే గురజాతీ బ్యూటీ అయిన నమితకు రాజకీయ ఆశ కలగడంతో తన రాష్ట్రానికి చెందిన నరేంద్రమోదీ ప్రధాని కావడంతో బీజేపీ పార్టీలో చేరతారని చాలా మంది భావించారు. అయితే వారి ఊహలను తలకిందులు చేస్తూ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఇది జరిగిన కొద్ది రోజులకే జయలలిత మరణించడం, అన్నాడీఎంకే పార్టీ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు అంటూ రెండుగా చీలిపోవడంతో ఏ వర్గం వైపు చేరాలన్న కన్ఫ్యూజన్కు గురైన నమిత తన రాజకీయ జీవితం ఆదిలోనే ఇలా అయిపోయిందేమిటని కలత చెందారట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. ఆ మధ్య మలయాళంలో మోహన్‌లాల్‌తో నటించిన పులిమురుగన్ మంచి విజయాన్ని సాధించడం నమితకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంలో పొట్టు తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో మళ్లీ నటిగా ఒక రౌండ్ కొట్టాలన్న ప్రయత్నంలో నమిత ఉన్నట్లు సమాచారం. -
అభిమాని కోసం సూపర్ స్టార్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించటమే కాదు, మాలీవుడ్ లో 50 కోట్ల, 100 కోట్ల రికార్డ్ లను కూడా సాధ్యం చేసి చూపించాడు మోహన్ లాల్. స్టార్ గా ఎంత ఎదిగిన తన అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ కంప్లీట్ యాక్టర్ తాజా అభిమాని కల నేరవేర్చేందుకు స్వయంగా పూనున్నాడు. ఎక్కడ ఒక వీడియోలో ఓ పెద్దావిడ తనను కలవాలనుందని తెలపడంతో ఆమెను కలిసేందుకు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఆ పెద్దావిడను కలిసి మోహన్ లాల్ ఆమెతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ లో పొస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. -
కోలీవుడ్‌లో పులిమురుగన్
యాక్షన్, ఎడ్వెంచర్ కథా చిత్రంగా రూపొందిన మలయాళ చిత్రం పులిమురుగన్. అక్కడ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కమలిని ముఖర్జీ కథానాయకిగా నటించారు. నమిత, జగపతిబాబు, లాల్, బాలా, వినూమోహన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనాన్ని ఉదయకృష్ట అందించారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ములకపడం ఫిలింస్ పతాకంపై తోమిచన్ ములకపడం నిర్మించారు. చిన్న చిత్రాలకు చిరునామా మాలీవుడ్ అన్న పేరును తడిపేసి రూ.37 కోట్ల వ్యయంతో రూపొంది రూ.150 కోట్లు వసూలు చేసి మలయాళ చిత్రపరిశ్రమలో ఈ రెండు విషయాల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన తొలి చిత్రం పులిమురుగన్. అంతే కాదు మన్యంపులి పేరుతో తెలుగులోకి అనువాదమై అక్కడ మంచి విజయాన్ని అందుకున్న పులిమురుగన్ ఇప్పుడు ఇదే పేరుతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. మలయాళ చిత్ర నిర్మాతనే ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. చిత్ర కథేంతంటే తన తండ్రిని తన కళ్ల ముందే చంపిన పులిని ఒక కుర్రాడు ఆ పులిని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు.అతను పెద్ద అయిన తరువాత కూడా పులుల నుంచి ఆ గ్రామాన్ని కాపాడడమే వృత్తిగా స్వీకరిస్తాడు. అతను పులులను ఎలా వేటాడతాడన్నదే చిత్ర కథనం అని చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో నాలుగు బీభత్సమైన పోరాట సన్నివేశాలు చోటుచేసుకుంటాయని చెప్పారు. చిత్ర చివరి ఘట్ట పోరాట దృశ్యాలను స్టంట్‌మాస్టర్ పీటర్హెయిన్స్ నేతృత్వంలో 96 రోజులు చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి గోపిసుందర్ సంగీతాన్ని అందించారు. -
ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమా కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేశాడు. ఇటీవల తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించాడు. దాదాపు హీరోకు సమానమైన పాత్రలో కనిపించిన మోహన్ లాల్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే మోహన్ లీడ్ రోల్లో నటించిన ఒప్పం కేరళలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కూడా 50 కోట్ల వసూళ్లు సాధించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మరో నెల రోజుల గ్యాప్‌లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్ సినిమామలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతుంది. ఇలా కేవలం రెండు నెలల కాలంలోనే మూడు సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను సాధించి చూపించాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. -
మలయాళంలో తొలి 100 కోట్ల సినిమా
బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల కలెక్షన్లు కామన్ అయినా.. రీజినల్ సినిమాకు మాత్రం ఇప్పటికీ వంద కోట్ల కలెక్షన్లు సాధించటం కష్టంగానే ఉంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒకటి రెండు సినిమాలు ఈ ఫీట్ సాధించినా.. మలయాల ఇండస్ట్రీలో మాత్రం ఇన్నాళ్లు సాధ్యం కాలేదు. తాజాగా పులిమురుగన్ సినిమాతో వంద కోట్ల క్లబ్‌కు గేట్లు ఓపెన్ చేశాడు మలయాల సూపర్ స్టార్ మోహన్ లాల్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన పులిమురుగన్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 2013లో రిలీజ్ అయిన దృశ్యంతో తొలిసారిగా మలయాళ ఇండస్ట్రీలో 50 కోట్ల వసూళ్లు సాధించిన మోహన్ లాల్, వంద కోట్ల వసూళ్ల సాధించిన తొలి సినిమా రికార్డ్‌ను కూడా తన పేరునే రాసుకున్నాడు. మాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను మన్యంపులి పేరుతో తెలుగు రిలీజ్ చేస్తున్నారు. మోహన్ లాల్ సరసన కమలినీ ముఖర్జీ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు విలన్ రోల్లో నటించాడు. -
చైనా, వియత్నాం భాషల్లో మోహన్‌లాల్ సినిమా
జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా సత్తా చాటిన సూపర్ స్టార్ ఇప్పుడు ఓవర్సీస్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మోహన్ లాల్ హీరోగా ఇటీవల విడుదలైన పులిమురుగన్ సినిమా మాలీవుడ్‌లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మోహన్ లాల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమాను ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు చైనా, వియత్నాం భాషల్లోకి కూడా అనువదించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని హీరో మోహన్ లాల్ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ప్రపంచ భాషల్లో పులిమురుగన్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇటీవల ఒప్పం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కంప్లీట్ యాక్టర్, పులిమురుగన్ సినిమాతో మరోసారి సూపర్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి వారంలోనే 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 400లకు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన పులిమురుగన్ ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తోంది. -
ఆయనతో నటించడం మంచి అనుభవం
సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అందాలభామ నమిత పేర్కొన్నారు. ఇంతకు ముందు తనదైన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించినఈ అమ్మడు మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. అయితే మళ్లీ నటించాలన్న కోరికతో బొద్దుగా ఉన్న నమిత సుమారు 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారుఅలా కొత్త అందాలతో రెడీ అయిన నమితకు మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయనతో నటించిన పులిమురుగన్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఈ సందర్భంగా నమిత ఆ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకున్నారు. ప్ర: మలయాళ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: నటిగా రీఎంట్రీకి రెడీ అయినప్పుడు మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. పులిమురుగన్ చిత్ర దర్శకుడు కథ వినిపించారు. అది అడ్వెచర్ కథ. అయితే ఆ కథను చెప్పినట్లుగా తెరకెక్కించగలరా? అన్న సందేహం కలిగింది. ఆ చిత్ర హీరో మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. అందుకే పులిమురుగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అందులో నా పాత్ర పేరు జూలి. ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి. అలాంటి అమ్మాయి పులిమురుగన్ గుణగణాలు మెచ్చి ఆయన్ని ప్రేమిస్తుంది. చిత్రం అంతా హీరోతో ఉంటూ ఆయనకు సహకరించే పాత్ర. మోహన్‌లాల్‌తో నటించడం చాలా మంచి అనుభవం. ప్ర: మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలు రూపొందుతాయంటారు.పులిమురుగన్ చిత్రం అలాంటిదేనా? జ: నిజమే మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలే రూపొందుతాయనే అపోహ ఉంది.అయితే ఈ పులిమురుగన్ 25 కోట్ల వ్యయంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో మోహన్‌లాల్ నటన అద్భుతం అనే చెప్పాలి. ప్ర: ఇతర చిత్రాల వివరాలు? జ: తమిళంలో భరత్‌కు జంటగా నటిస్తున్న పొట్టు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి జానీ అనే ఆయన చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం వేచి చూస్తున్నాను. మరి కొన్ని చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.తమిళం,తెలుగు, మలయాళం భాషల్లో మరో రౌండ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్ర: సినిమాలు,రాజకీయాల్లో పయనించడం గురించి? జ: రెండు వేర్వేరు వృత్తులు. ప్రజలకు ఏమైనా చేయాలని భావించాను. అందుకు తన వంతు సాయం చేస్తున్నాను. సినిమాకు,రాజకీయాలకు సంబంధం లేదు. ప్ర: ముఖ్యమంత్రి జయలలిత గురించి? జ: ముఖ్యమంత్రి జయలలిత ఇంతకు ముందే ఎన్నో కష్టాలను అధిగమించారు. కోట్లాదిమంది అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. కాబట్టి అమ్మ త్వరలోనే క్షేమంగా తిరిగొస్తారు. -
హర్రర్ కామెడీలో జగ్గూభాయ్
హీరోగా సక్సెస్‌లకు దూరమయిన తరువాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు. ముఖ్యంగా బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌కు తండ్రిగా నటించిన తరువాత సౌత్ ఇండస్ట్రీలో జగపతిబాబు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే స్థాయిలో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు జగపతిబాబు. దీంతో చిన్న నిర్మాతలకు జగపతిబాబు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సరైన కథ వస్తే మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా తాను రెడీ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తేరి, మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పులిమురుగన్ సినిమాల్లో విలన్‌గా నటిస్తున్న జగ్గూభాయ్, తెలుగులో లోబడ్జెట్ హర్రర్ కామెడీలోనూ నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు సుధాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. -
మోహన్ లాల్‌కు తప్పిన ప్రమాదం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురువారం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు కేరళలోని మళయత్తూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పులిమురుగన్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్న మోహన్ లాల్ కారు, వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ లాల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం మలయాళంలో పులిమురుగన్ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్, తెలుగులోనూ మరో రెండు సినిమాలను అంగీకరించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలోనూ నటించనున్నారు.