హర్రర్ కామెడీలో జగ్గూభాయ్ | Jagapathi Babu's next film a horror comedy | Sakshi
Sakshi News home page

హర్రర్ కామెడీలో జగ్గూభాయ్

Published Wed, Mar 16 2016 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

హర్రర్ కామెడీలో జగ్గూభాయ్

హర్రర్ కామెడీలో జగ్గూభాయ్

హీరోగా సక్సెస్లకు దూరమయిన తరువాత విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు. ముఖ్యంగా బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్కు తండ్రిగా నటించిన తరువాత సౌత్ ఇండస్ట్రీలో జగపతిబాబు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే స్థాయిలో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు జగపతిబాబు. దీంతో చిన్న నిర్మాతలకు జగపతిబాబు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో సరైన కథ వస్తే మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా తాను రెడీ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తేరి, మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పులిమురుగన్ సినిమాల్లో విలన్గా నటిస్తున్న జగ్గూభాయ్, తెలుగులో లోబడ్జెట్ హర్రర్ కామెడీలోనూ నటిస్తున్నాడు.  కొత్త దర్శకుడు సుధాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement