అమ్మాయి ఏమైంది?
బ్యాంక్ రికవరీ ఏజెంట్‌గా వర్క్ చేస్తున్న హీరో, మేనేజర్ కూతురి పెళ్లికి వెళ్లి తన పెళ్లి సెట్ చేసుకోవాలనుకుంటాడు. ఆ పెళ్లికొచ్చిన మెడికల్ స్టూడెంట్‌ని ఎలాగైనా జీవిత భాగస్వామి చేసుకోవాలని డిసైడ్ అయి, ప్రేమను చెప్పాలని వెళతాడు. ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఇంతలో అతనికో ఫోన్ కాల్ వస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఏమైంది? ఫోన్ చేసింది ఎవరు..? హీరో తన ప్రేమను గెల్చుకున్నాడా? ఆనే కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘భైరవ’.
ఇళయదళపతి విజయ్, కీర్తీ సురేష్ జంటగా భరతన్ దర్శకత్వం వహించారు. జగపతిబాబు కీలక పాత్ర చేశారు. సంతోష్‌నారాయణ్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి తెలుగులో ‘ఏజంట్ భైరవ’గా జూలై 7 న రిలీజ్ చేస్తున్నారు. ‘‘హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రమిది. జగపతిబాబుగారి నటన హైలైట్. మా బ్యానర్‌లో హీరో విజయ్ తెలుగులో మంచి హిట్ అందుకుంటాడని అశిస్తున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణారెడ్డి.