భైరవ ఏం చేశాడు? | Vijay's birthday occasionally 'Agent Bhairava'. Film Teaser Release | Sakshi
Sakshi News home page

భైరవ ఏం చేశాడు?

Published Thu, Jun 22 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

భైరవ ఏం చేశాడు?

భైరవ ఏం చేశాడు?

విజయ్, కీర్తీ సురేశ్‌ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఏజంట్‌ భైరవ’.   భరతన్‌ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్న ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ మూవీ ఇది. నేడు విజయ్‌ పుట్టినరోజు (జూన్‌ 22) సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశాం.

ఈ సినిమా విజయ్‌కి తెలుగులో మంచి మైలురాయిగా నిలుస్తుంది. విజయ్, కీర్తిల నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి. జూలై ద్వితీయార్థంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సతీష్, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్, పాప్రీ గోష్, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, కెమెరా: ఎమ్‌. సుకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement