దర్శకునిగా రాణించడమే ఇష్టం
విజయ్, కీర్తీ సురేశ్ జంటగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘భైరవ’ తెలుగులో ‘ఏజెంట్ భైరవ’ పేరుతో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘ఓ సమస్యలో ఇరుక్కున్న హీరోయిన్‌ని హీరో ఎలా కాపాడా డన్నదే కథ.
ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులకు కనీస విద్యార్హతలు ఉండాలనే మేసేజ్ కూడా సినిమాలో ఉంది. కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్’’ అన్నారు. తదుపరి ప్రణాళికల గురించి రామకృష్ణారెడ్డి చెబుతూ – ‘‘నా డైరెక్షన్‌లో ఒక ప్రముఖ హీరోయిన్‌తో ఓ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయబోతున్నాను. నిర్మాతగా కన్నా దర్శకునిగా రాణించడమే నాకు ఇష్టం. ‘దృశ్యకావ్యం–2’ ఆల్రెడీ 45 నిమిషాల షూటింగ్ కంప్లీట్ చేశాం. హీరోయిన్ వ్యక్తిగత సమస్యల కారణంగా ఆ సినిమాను పక్కన పెట్టవలసి వచ్చింది. తమిళ చిత్రం ‘బెలూన్’ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు.