సూపర్ రెస్పాన్స్
విజయ్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ చిత్రం ‘భైరవ’ తెలుగులో ‘ఏజంట్ భైరవ’ పేరుతో గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. బెల్లం రామకృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేశారు. విజయ్, కీర్తీ సురేశ్ హీరో హీరోయిన్లు. ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోందని రామకృష్ణారెడ్డి చెబుతూ – ‘‘228 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశాం. రెస్పాన్స్ బాగుండడంతో మరో 15 థియేటర్లు పెంచబోతున్నాం. ఈ చిత్రానికి మౌత్‌టాక్, కలెక్షన్స్ బాగున్నాయి. జగపతిబాబుగారి నటన హైలైట్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.