Good Luck Sakhi MovieTwitter Review In Telugu | Keerthi Suresh Good Luck Sakhi Twitter Review - Sakshi
Sakshi News home page

Good Luck Sakhi Twitter Review: కీర్తి సురేశ్‌ ‘గుడ్‌ లక్‌ సఖి’ మూవీ ఎలా ఉందంటే..?

Published Fri, Jan 28 2022 9:29 AM | Last Updated on Fri, Jan 28 2022 9:51 AM

Good Luck Movie Twitter Review In Telugu - Sakshi

‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్‌ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్‌ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్‌ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్‌ మూవీ ‘గుడ్‌ లక్‌ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ  కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్‌ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి  ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్‌ చూసిన ఆడియన్స్‌.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్‌ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. గుడ్‌ లక్‌ సఖి కాదు బ్యాడ్‌ లక్‌ కీర్తి అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement