మలయాళంలో తొలి 100 కోట్ల సినిమా | pulimurugan first 100 cr grosser in Kerala | Sakshi
Sakshi News home page

మలయాళంలో తొలి 100 కోట్ల సినిమా

Published Sun, Oct 30 2016 10:55 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

మలయాళంలో తొలి 100 కోట్ల సినిమా

మలయాళంలో తొలి 100 కోట్ల సినిమా

బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల కలెక్షన్లు కామన్ అయినా.. రీజినల్ సినిమాకు మాత్రం ఇప్పటికీ వంద కోట్ల కలెక్షన్లు సాధించటం కష్టంగానే ఉంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఒకటి రెండు సినిమాలు ఈ ఫీట్ సాధించినా.. మలయాల ఇండస్ట్రీలో మాత్రం ఇన్నాళ్లు సాధ్యం కాలేదు. తాజాగా పులిమురుగన్ సినిమాతో వంద కోట్ల క్లబ్కు గేట్లు ఓపెన్ చేశాడు మలయాల సూపర్ స్టార్ మోహన్ లాల్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన పులిమురుగన్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

2013లో రిలీజ్ అయిన దృశ్యంతో తొలిసారిగా మలయాళ ఇండస్ట్రీలో 50 కోట్ల వసూళ్లు సాధించిన మోహన్ లాల్, వంద కోట్ల వసూళ్ల సాధించిన తొలి సినిమా రికార్డ్ను కూడా తన పేరునే రాసుకున్నాడు. మాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను మన్యంపులి పేరుతో తెలుగు రిలీజ్ చేస్తున్నారు. మోహన్ లాల్ సరసన కమలినీ ముఖర్జీ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు విలన్ రోల్లో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement