ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు | Mohanlal movies together collected 200 crore from 2 months | Sakshi
Sakshi News home page

ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు

Published Fri, Nov 4 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు

ఒక హీరో.. రెండు నెలలు.. రెండు వందల కోట్లు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించి రీజినల్ సినిమా కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేశాడు. ఇటీవల తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించాడు. దాదాపు హీరోకు సమానమైన పాత్రలో కనిపించిన మోహన్ లాల్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే మోహన్ లీడ్ రోల్లో నటించిన ఒప్పం కేరళలో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కూడా 50 కోట్ల వసూళ్లు సాధించి మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరో నెల రోజుల గ్యాప్లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్ సినిమామలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతుంది. ఇలా కేవలం రెండు నెలల కాలంలోనే మూడు సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను సాధించి చూపించాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement