చైనా, వియత్నాం భాషల్లో మోహన్లాల్ సినిమా | Mohanlal's 'Pulimurugan' to be dubbed in Chinese, Vietnamese | Sakshi
Sakshi News home page

చైనా, వియత్నాం భాషల్లో మోహన్లాల్ సినిమా

Published Thu, Oct 13 2016 2:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

చైనా, వియత్నాం భాషల్లో మోహన్లాల్ సినిమా

చైనా, వియత్నాం భాషల్లో మోహన్లాల్ సినిమా

జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా సత్తా చాటిన సూపర్ స్టార్ ఇప్పుడు ఓవర్సీస్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.

మోహన్ లాల్ హీరోగా ఇటీవల విడుదలైన పులిమురుగన్ సినిమా మాలీవుడ్లో సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. మోహన్ లాల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమాను ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు చైనా, వియత్నాం భాషల్లోకి కూడా అనువదించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని హీరో మోహన్ లాల్ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ప్రపంచ భాషల్లో పులిమురుగన్ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.

ఇటీవల ఒప్పం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కంప్లీట్ యాక్టర్, పులిమురుగన్ సినిమాతో మరోసారి సూపర్ స్టార్గా ప్రూవ్ చేసుకున్నాడు. 25 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలి వారంలోనే 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 400లకు పైగా స్క్రీన్స్లో రిలీజ్ అయిన పులిమురుగన్ ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement