superstar
-
అచ్చం సూపర్ స్టార్‌లాగానే.. వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది
-
మహేష్‌బాబుతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
Jaya Krishna Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు (ఫోటోలు)
-
సూపర్‌స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది: స్టార్ హీరోయిన్
కోలీవుడ్‌లో 'సూపర్‌స్టార్' అనే హోదాపై ఇటీవల పెద్ద రచ్చే జరిగింది. దాదాపు 40 ఏళ్లుగా సూపర్‌స్టార్ అనే పట్టం రజనీకాంత్‌ని అంటిపెట్టుకుని వస్తోంది. అలాంటిది ఇటీవల కాలంలో స్టార్ హీరో విజయ్‌కు ఆ ట్యాగ్‌లైన్ కరెక్ట్ అనే ప్రచారాన్ని ఒక వర్గం తెరపైకి తెచ్చింది. ఒక రకంగా రజనీకాంత్ పని అయిపోయింది. ఇప్పుడు అసలైన సూపర్‌స్టార్ విజయ్ అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ఇటీవల అక్కడి టీవీ ఛానళ్లలో కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ సూపర్‌స్టార్ అనేది ఒక తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ నటులకు అభిమానులు కట్టిన పట్టం. అలాంటి సూపర్‌స్టార్ పట్టం గురించి దూత వెబ్ సీరిస్‌లో మెప్పించిన నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళంలో 'పూ' చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమై.. ఆ తరువాత ధనుష్ సరసన మరియాన్, కమలహాసన్‌తో ఉత్తమ విలన్, అదేవిధంగా శరత్‌కుమార్ నటించిన చైన్నెయిల్ ఆరు నాళ్, రానా, బాబి సింహా తదితరులు నటించిన బెంగళూరు నాట్కల్, శివరంజ, నియుమ్ ఇన్ముమ్ సిల పెంగుళుమ్ వంటి హిట్ చిత్రాలలో ఆమె నటించారు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తంగలాన్' చిత్రంలో విక్రమ్‌తో కలిసి నటించారు. వీటితో పాటు నాగ చైతన్యతో 'దూత' అనే వెబ్‌సిరీస్‌లో క్రాంతి షెనాయ్గా ఆమె మెప్పించారు. ఇలా సెలెక్టడ్ చిత్రాల్లోనే నటిస్తున్న పార్వతి మలయాళంలోనే సుమారు 30కి పైగా సినిమాల్లో నటించి బిజీగా ఉన్నారు. ఈమె ఇటీవల ఒక భేటీలో సూపర్‌స్టార్ పట్టం గురించి మాట్లాడుతూ సూపర్‌స్టార్ అని చెప్పుకోవడంలో ఏం గౌరవం ఉంది అని ప్రశ్నించారు. అది జస్ట్ సమయానుకూలంగా చెప్పుకునేది మాత్రమేనని, దాని వల్ల ఎవరికీ ప్రయోజనం అని ప్రశ్నించారు. అసలు సూపర్‌స్టార్ అంటే ఏమిటో తనకు అర్థం కాలేదని, దాని వల్ల ఇమేజ్ వస్తుందా అన్నది కూడా తెలియటం లేదన్నారు. తనను సూపర్‌స్టార్ అనడం కంటే సూపర్ యాక్టర్ అని పిలవడమే సంతోషం అని పేర్కొన్నారు. తనకు తెలిసి మలయాళంలో ఫాహత్ ఫాజిల్, ఆసిఫ్ అలీ, నటి రామీ కళింగల్ సూపర్ యాక్టర్స్ అని నటి పార్వతి పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) -
Rajinikanth: బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ అరుదైన (ఫొటోలు)
-
కన్నడ సూపర్‌స్టార్‌ను కలిసిన టాలీవుడ్ హీరో నాని (ఫొటోలు)
-
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకిరా, గౌతమ్
-
కాంతార హీరోను అభినందించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ భావోద్వేగ లేఖ
చెన్నై: "దయచేసి నన్ను నొప్పించకండి.." అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రావాలని.. మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వస్తున్న విజ్ఞప్తులపై కొంత ఆవేదన చెందుతూ రజనీ తన నిరాసక్తతను వ్యక్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం తాను రాజకీయాల్లోకి రాను అని డిసెంబర్ 30వ తేదీన సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. తమిళ రాజకీయ పార్టీలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రజనీ కోలుకుని తిరిగి రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం రజనీ కోలుకున్నారు. ఈ క్రమంలో ‘మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని.. రాజకీయాల్లోకి రావాలని’ అభిమానులు కోరుతున్నారు. విభిన్న రీతిలో ఈ విషయాన్ని రజనీకి చేరేలా చేస్తున్నారు. ఆదివారం (జనవరి 10) అభిమానులు ధర్నా చేశారు. తమ నిర్ణయం మార్చుకోవాలని.. రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో రజనీకాంత్ సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నేను కారణాలు ముందే వివరించా. నా నిర్ణయం చెప్పేశా. ఇక ఈ విషయమై నన్ను ఇబ్బంది పెట్టొంది. రాజకీయాల్లోకి రావాలని మళ్లీ మళ్లీ అడిగి నొప్పించవద్దు.’’ అని రజనీకాంత్ ఓ లేఖ విడుదల చేశారు. గత నెలలో హైదరాబాద్ లో రజనీకాంత్ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నె వెళ్లిన తర్వాత ‘నేను రాజకీయాల్లోకి రాను’ అని చెప్పారు. ‘నా అనారోగ్యం దేవుడు చేసిన హెచ్చరిక. రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది’ అని రాజకీయాలకు రాం రాం చెప్పేశారు. డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తానన్నరాజకీయ పార్టీ ఆగిపోయిన విషయం తెలిసిందే. -
పొలిటికల్ ఎంట్రీపై సూపర్‌స్టార్ పునరాలోచన!
చెన్నై : రాజకీయ రంగప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ పునరాలోచనలో పడినట్టు సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానని ఆయన బుధవారం పేర్కొన్నారు. తాను రాసినట్టు చెబుతున్న బహిర్గతమైన లేఖపై రజనీ వివరణ ఇచ్చారు. ఈ లేఖ తాను రాయలేదని..అయితే తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమేనని ఓ ప్రకటనలో తెలిపారు. తాను రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి రాజకీయ వైఖరిపై సరైన సమయంలో ప్రకటన చేస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ఎంట్రీ ఖాయమని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్దిముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తితో తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయని రజనీ రాసినట్టు చెబుతున్న లేఖపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నందున కోవిడ్-19 సోకే ప్రమాదం ఉందని సమూహాల్లో కలువరాదని వైద్యులు ఆయనకు సూచించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న వారి బాగోగుల కంటే తన గురించి తాను ఎక్కువగా విచారించబోనని ఈ లేఖలో రజనీ పేర్కొనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఈ ఏడాది మార్చిలో రజనీ తేల్చిచెప్పారు. చదవండి : రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్ -
టిక్‌టాక్ సూపర్‌స్టార్
అతనికి టిక్‌టాక్‌లో 20 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతని ఒక్క ఫోన్ కాలం వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. అతనిలా టిక్‌టాక్ చేసే వీరాభిమానులూ ఉన్నారు. ఆ టిక్ టాక్ సూపర్‌స్టార్ పేరు ఇస్రాయిల్ అన్సారి. ‘నేను ఇక మీదట నా అభిమానులతో మాట్లాడాలనుకుంటున్నాను. దానికి ఒక్కొక్కరికీ 400 రూపాయలు చార్జ్ చేస్తాను’ అని అతడు పోస్ట్ పెట్టగానే ఆ రోజున 2000 కాల్స్ వచ్చాయతనికి. ముంబై నుంచి ఒక అభిమాని లక్నోకు వెళ్లి, అక్కడి నుంచి అతడి స్వగ్రామం కబీర్‌పూర్‌కు వెళ్లి, వీడియో దిగి ఆ సంగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నా జన్మ ధన్యమైంది అని రాసుకొచ్చాడు. ఆ అతడి పేరు ఇస్రాయిల్ అన్సారీ. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుపేద కుర్రవాడు. ఐదో క్లాసు వరకు చదువుకున్నాడు. ఇనుప సామాన్ల అంగడిలో చిరుద్యోగి. కాని ఇప్పుడతడు దేశవిదేశాల్లో తెలిసిన సూపర్‌స్టార్. తరచూ ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొంటుంటాడు. ముంబైలో అతడు వీధిలో నడుస్తుంటే ప్రతి పది గజాలకు ఒకరు ఆపి అతడితో సెల్ఫీ దిగుతుంటారు. అంత ఫేమస్ అతడు. ఇంతకూ ఇతను టిక్‌టాక్‌లో ఏం చేస్తాడు అనంటే హిందీ సినిమా పాటలకు గెంతులు వేస్తుంటాడు. ఆ గెంతులు అమాయకంగా ఉంటాయి. నిజానికి ఇస్రాయిల్ అన్సారీకి డాన్స్ రాదు. వేగంగా, పిచ్చి గంతులు వేస్తూ పాటకు అక్షరాభినయం చేస్తాడు. అంటే ‘కళ్లు’ అని వస్తే కళ్లు చూపించడం, కాళ్లు అని వస్తే కాళ్లు చూపించడం. కొంచెం మెల్లకన్ను, భిన్నమైన గెంతులు, అమాయకత్వం, చిత్రమైన తల కట్టు, పసుపు ఎరుపు రంగు చొక్కాలు ఇవన్నీ కలిసి ఇస్రాయిల్ను జనం అభిమానించేలా చేశాయి. ‘ఒక పెళ్లికి వెళితే ఎవరో ఫోన్లో టిక్‌టాక్ చూపించారు. అప్పటికి నా దగ్గర స్మార్ట్ ఫోన్‌లేదు. సూరత్‌లో పని చేసే మా అన్నయ్యను అడిగి తెప్పించుకున్నాను’ అంటాడు ఇస్రాయిల్. తండ్రికి స్వగ్రామంలో చిన్న కిరాణా షాపు ఉంది. పది మంది సంతానంలో ఇస్రాయిల్ ఒకడు. జీవితంలో ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్న ఇస్రాయిల్ స్మార్ట్‌ఫోన్ రాగానే దాపున ఉన్న పొలాలకు వెళ్లి షారుక్ ఖాన్ పాటకు పిచ్చి గెంతులు గెంతి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. గంటలో 33 వేల లైకులు వచ్చాయి. అలా ఆ స్టార్ ఉద్భవించాడు. ఇప్పుడు ఇస్రాయిల్ అన్సారీ ఏ పని చేయడు. రోజుకు మూడు నాలుగు వీడియోలు తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడమే. దీని వల్ల వచ్చిన క్రేజ్‌తో అతడికి అభిమానుల నుంచి డబ్బులు వస్తున్నాయి. కుర్రవాళ్లు ఇతని భక్తబృందంగా మారి ఇతనిలా టిక్‌టాక్‌లు చేయడం మొదలుపెట్టారు. అయితే టిక్‌టాక్‌ను బేన్ చేశారని తెలిసినప్పుడు ఇస్రాయిల్ నడుము విరిగినట్టు అయ్యింది. కాని దానిని ఎత్తేయడంతో సంతోషపడ్డాడు. అతడికి ఈ తాత్కాలిక ఖ్యాతి ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ‘కాని ఎంతకాలం అయినా నేను స్టార్‌గానే ఉంటాను’ అంటాడు అమాయకంగా. ఇస్రాయిల్ అన్సారి తిక్క డాన్సులను చూసి అతడిని ట్రోల్చేసేవారున్నారు. కాని వారిని చూసి ఇస్రాయిల్ నవ్వి ఊరుకుంటాడు. టిక్‌టాక్ మంచిది కాదని అభ్యంతరాలు ఉండొచ్చు. కాని లక్నో సమీపంలోని పల్లెటూరి కుర్రవాడు దాని వల్ల లబ్ధి పొందాడు. లక్షల మందిలో ఏ కొద్దిమందికే ఈ యోగం దక్కుతుంది. ఆ ఒక్కరు ఈ పేదవాడు కావడం సంతోషించాల్సిన సంగతి. యూ ట్యూబ్‌లో ఇస్రాయిల్ అన్సారీ టిక్‌టాక్ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. -
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీజర్ విడుదల చేసిన మహేశ్
-
అభద్రతాభావమే అందుకు కారణం
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది. అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్. -
దీపావళి రేస్‌లో సూపర్‌స్టార్
దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలు తెరపైకి వస్తే ఆ సందర్భాలు వారి అభిమానులకు మరో పండగే. అలాంటిది ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం దీపావళికి విడుదలైతే ఆ సందడే వేరు. రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన చిత్రం ఏ భాషలో రూపొందినా అది పలు దేశాల్లో ప్రదర్శింపబడుతుంది. ఇకపోతే కారణాలేమైనా రజనీకాంత్ నటించిన చిత్రాలు ఈ మధ్య దీపావళి పండగకు తెరపైకి రావడం లేదు. పండగల సందర్భంగా తమ సూపర్‌స్టార్ చిత్రాలు విడుదల కావాలని ఆయన అభిమానులు కోరుకుంటుంటారు. అరుుతే రజనీకాంత్ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ముత్తు చిత్రం 1995లో దీపావళి సందర్భంగా అక్టోబర్ మూడవ తేదీన విడుదలైంది. ఆ తరువాత ఆయన నటించిన ఏ చిత్రం ఇప్పటి వరకూ దీపావళికి తెరపైకి రాలేదు. అలాంటిది 2017లో 2.ఓ చిత్రం దీపావళి పండగ సందర్భంగా విడుదల కానుంది. అంటే 21 ఏళ్ల తరువాత సూపర్‌స్టార్ నటించిన చిత్రం ఈ పండగకు రానుందన్న మాట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారా స్థారుుకి చేరుకున్నారుు. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నిపుణుల సృష్టితో అత్యధిక బడ్జెట్‌తో 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా సూపర్‌స్టార్ చిత్రం 2.ఓ రికార్డుకెక్కనుంది. ఇక ఈ చిత్రం తిరగరాసే రికార్డుల కోసం ఎదరుచూద్దాం. -
దటీజ్ రజనీకాంత్..!
రజనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్‌కుమార్ ‘రజనీ సర్ ఒక సూపర్ స్టార్ కాదు. ఆయన ఎంటైర్ గెలాక్సీ (పాలపుంత). సిగరెట్‌ను కాల్చడంలో అయినా, కోటును స్టైలిష్‌గా సరిచేసుకోవడంలో అయినా ఆయన స్టైల్ ఆయనదే. ఆయన స్టైల్ నుంచి నేర్చుకోని వారు ఎవరూ ఉండరు’ అంటూ అక్షయ్‌కుమార్ సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రోబో-2 (2.0) సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా అక్షయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. గతంలో తన సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కానప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రజనీ డబ్బులు వాపస్ ఇచ్చారని తెలుసుకొని తాను అబ్బురపడ్డానని, అదీ రజనీ గొప్పతనమని అన్నారు. ‘ నాకు గుర్తుంది ఆయన సినిమా ‘బాబా’ పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన డిస్ట్రిబ్యూటర్లను పిలిచి మరీ డబ్బులు ఇచ్చారు. ఆయన నిజమైన సూపర్ స్టార్ అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలి’ అని అక్షయ్ పేర్కొన్నారు. తన 25 ఏళ్ల కెరీర్లో తాను ఎప్పుడూ పెద్దగా మేకప్ వేసుకోలేదని, కానీ రోబో-2 సినిమాలో విలన్ పాత్ర కోసం మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు, మేకప్ తీయడానికి ఒక గంట తనకు పట్టేదని చెప్పారు. తనకు మేకప్ వేస్తున్నంతసేపు తాను టీవీలో సినిమాలు చూస్తుండేవాడిని తెలిపారు. -
ఆయనతో నటించడం మంచి అనుభవం
సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అందాలభామ నమిత పేర్కొన్నారు. ఇంతకు ముందు తనదైన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించినఈ అమ్మడు మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. అయితే మళ్లీ నటించాలన్న కోరికతో బొద్దుగా ఉన్న నమిత సుమారు 20 కిలోల బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారుఅలా కొత్త అందాలతో రెడీ అయిన నమితకు మలయాళంలో అక్కడి సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయనతో నటించిన పులిమురుగన్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఈ సందర్భంగా నమిత ఆ చిత్రంలో నటించిన అనుభవాలను పంచుకున్నారు. ప్ర: మలయాళ చిత్రంలో నటించిన అనుభవం గురించి? జ: నటిగా రీఎంట్రీకి రెడీ అయినప్పుడు మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. పులిమురుగన్ చిత్ర దర్శకుడు కథ వినిపించారు. అది అడ్వెచర్ కథ. అయితే ఆ కథను చెప్పినట్లుగా తెరకెక్కించగలరా? అన్న సందేహం కలిగింది. ఆ చిత్ర హీరో మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో నటించే అవకాశం రావడం సాధారణ విషయం కాదు. అందుకే పులిమురుగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను.అందులో నా పాత్ర పేరు జూలి. ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి. అలాంటి అమ్మాయి పులిమురుగన్ గుణగణాలు మెచ్చి ఆయన్ని ప్రేమిస్తుంది. చిత్రం అంతా హీరోతో ఉంటూ ఆయనకు సహకరించే పాత్ర. మోహన్‌లాల్‌తో నటించడం చాలా మంచి అనుభవం. ప్ర: మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలు రూపొందుతాయంటారు.పులిమురుగన్ చిత్రం అలాంటిదేనా? జ: నిజమే మలయాళంలో లోబడ్జెట్ చిత్రాలే రూపొందుతాయనే అపోహ ఉంది.అయితే ఈ పులిమురుగన్ 25 కోట్ల వ్యయంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో మోహన్‌లాల్ నటన అద్భుతం అనే చెప్పాలి. ప్ర: ఇతర చిత్రాల వివరాలు? జ: తమిళంలో భరత్‌కు జంటగా నటిస్తున్న పొట్టు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి జానీ అనే ఆయన చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కోసం వేచి చూస్తున్నాను. మరి కొన్ని చిత్రాల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.తమిళం,తెలుగు, మలయాళం భాషల్లో మరో రౌండ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్ర: సినిమాలు,రాజకీయాల్లో పయనించడం గురించి? జ: రెండు వేర్వేరు వృత్తులు. ప్రజలకు ఏమైనా చేయాలని భావించాను. అందుకు తన వంతు సాయం చేస్తున్నాను. సినిమాకు,రాజకీయాలకు సంబంధం లేదు. ప్ర: ముఖ్యమంత్రి జయలలిత గురించి? జ: ముఖ్యమంత్రి జయలలిత ఇంతకు ముందే ఎన్నో కష్టాలను అధిగమించారు. కోట్లాదిమంది అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. కాబట్టి అమ్మ త్వరలోనే క్షేమంగా తిరిగొస్తారు. -
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు. -
వైజాగ్‌లో కిచెన్ సూపర్ స్టార్ కాంటెస్ట్
-
నేను అలాంటి సూపర్‌స్టార్‌ని కాను!
న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ అంటే ప్రస్తుతం అర్థం మారిపోయిందని, ఆన్లైన్లో ఎక్కువ హిట్స్ తెచ్చుకోవడమే ఇప్పుడు సూపర్‌స్టార్ అన్నట్టుగా మారిపోయిందని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేర్కొంది. తను చేసిన పని ఆధారంగానే పేరు తెచ్చుకుంటాను కానీ, సోషల్ మీడియాలో చేసే జిమ్మిక్కుల ఆధారంగా కాదని నేషనల్ అవార్డు గెలుచుకున్న ఈ నటి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సెన్సేషనలిజానికి పెద్ద పీట వేయడాన్ని చూస్తుంటే బాధ కలుగుతుందని, ఈ సెన్సేనలిజానికి పాల్పడే వారే ప్రస్తుతం సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కంగన పేర్కొంది. 'సోషల్ మీడియాలో తన సామర్థ్యంతో ప్రజలను థ్రిల్ చేసేవారు, వారిని వెర్రివాళ్లను చేసేవారే ఇప్పుడు సూపర్‌స్టార్స్ అవుతున్నారు. ప్రస్తుత తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మంచి వ్యక్తులు కనబడకపోవడం బాధ కలిగిస్తోంది' అని 28 ఏళ్ల కంగన తెలిపింది. సీఐఐ-యంగ్ ఇండియా సదస్సులో ఆమె మాట్లాడుతూ 'ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నవాళ్లు, శరీరాన్ని బాగా ప్రదర్శించేవాళ్లు, ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడు సూపర్స్టార్లు అవుతున్నారు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి.. ఏదైనా సెన్సేషనల్ చేస్తే.. నేను కూడా రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అవుతాను. నేను అలాంటి వ్యక్తినా? అలాంటి సూపర్ స్టార్‌ను కావాలనుకుంటున్నానా? కానే కాదు' అని కంగన పేర్కొంది. నిజజీవితంలో ఏదైనా సాధించి.. సమాజానికి సేవ చేసే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులనే ఆదర్శంగా తీసుకోవాలని ఆమె యువతకు సూచించారు. -
మౌనమే రజనీ సమాధానం
చెన్నై : తమిళనాట ఎప్పుడు రాజకీయ వాతావరణం నెలకొన్నా అప్పుడు ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రసక్తి రాకుండా పోదు. అంతటి ప్రభావం కలిగిన వ్యక్తి సూపర్‌స్టార్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమానులు రాజకీయ ప్రవేశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందొక సారి ఎన్నికల పొత్తు విషయంలో చక్రం తిప్పి ఆ కూటమికి విజయాన్ని ఆపాదించిన రజనీకాంత్ ఆపై రాజకీయాల్లోకి రావడం తథ్యం అన్న భావన చాలా మందిలో కలిగింది. అయితే అలాంటి ఊహలను తారుమారు చేస్తూ నేటికి రాజకీయాలకు దూరం దూరం అంటూ మెయిన్‌టెయిన్ చేస్తున్న రజనీకాంత్ ఇప్పుడు మరోసారి రాజకీయ వార్తలకు కేంద్రబిందువుగా మారారు.ఆ మధ్య బీజేపీ పార్టీ రజనీకాంత్‌కు గాలం వేస్తోందనే ప్రచారం హోరెత్తింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీనే స్వయంగా సూపర్‌స్టార్ రజనీని కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.అయితే అప్పుడు రజనీ... మోదీకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పి మద్దతు తెలపకుండా అందర్నీ ఆశ్చర్యపరచారు. కాగా ఇటీవల చిత్రరంగానికి రజనీ చేసిన సేవకు గాను కేంద్రప్రభుత్వం రజనీకి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇదీ రాజకీయ ఎత్తుగడలో భాగమేన ని ఒక వర్గం గళం విప్పింది. కాగా తాజాగా శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో రజనీకాంత్ పేరు మరోసారి చర్చలో న లుగుతోంది.అయితే ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ అందులో ఒక చిత్రం కబాలి షూటింగ్‌ను మలేషియాలో పూర్తి చేసి సోమవారం రాత్రికి చెన్నైకి చేరుకున్నారు.ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో కలిసిన విలేకరుల పలు ప్రశ్నలకు సమాధానం దాటవేయడం గమనార్హం. ముఖ్యంగా రాజకీయపరమైన ప్రశ్నలకు బదులివ్వడానికి విముఖత వ్యక్తం చేశారు.ఆయన ఏమన్నారో చూద్దాం. నాకు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం సంతోషమే.అందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు.ఈ అవార్డు నాకు ఆలస్యంగా లభిస్తోందని భావించడం లేదు. అదే విధంగా అవార్డు విషయంలో కేంద్రప్రభుత్వం తమిళులపై సవతి ప్రేమ చూపుతోందని అనుకోవడంలేదు అని పేర్కొన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల గురించి వ్యాఖ్యానించమన్న ప్రశ్నకు రజనీ మౌనమే సమాధానం అనేలా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి: రజనీ
చెన్నై : చలన చిత్రపరిశ్రమంతా ఓ కుటుంబమని సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. ఆదివారం ఉదయం చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు చెన్నైలో అళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో రజనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విజేతలు హామీలు నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేయాలని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే చలన చిత్రరంగానికి చెందిన ప్రముఖలంతా పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. శరత్‌కుమార్, విజయ్, రాధా, రజనీ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పదేళ్లుగా నడిగర్ సంఘానికి ప్రముఖ నటుడు శరత్‌కుమార్ బృందం కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఆ బృందమే పదవీ బాధ్యతలు కొనసాగాలని భావించింది. అయితే ప్రముఖ నటుడు విశాల్ బృందం జట్టు కూడా ఈ సంఘం బాధ్యతలు చేపట్టేందుకు ఉత్సాహాన్ని చూపింది. దీంతో ఈ సంఘానికి ఎన్నికలు అనివార్యమైనాయి. అంతేకాకుండా అటు శరత్‌కుమార్ జట్టు... ఇటు విశాల్ జట్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని ... చివరికి ఈ రెండు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి నెలకొంది. దాంతో ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఓ విధంగా చెప్పాంటే సీనియర్ నటులు... జూనియర్ నటుల మధ్య పోటీగా మారిందని చెప్పవచ్చు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు మాత్రం శరత్కుమార జట్టుకే ఉందని సమాచారం. కానీ ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం విశాల్ జట్టుకు వరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న పద్మనాభన్ ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆళ్వార్ పేట పరిసర ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ నడిగర్ సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా లేక సాధారణ పోటీ మధ్య ఎంపికయిన జట్టు పదవీ బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. -
కాళిగా రజనీకాంత్?
-
లారెన్స్ డైరెక్షన్లో రజనీ..?
-
రజనీకాంత్ కేసు వాయిదా
చెన్నై : హిందీ చిత్రం మేహూ రజనీకాంత్ విడుదలపై నిషేధం విధించాలంటూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును ఇంతకు ముందు విచారించిన న్యాయ స్థానం మైహూ రజనీకాంత్ చిత్రం విడుదల పై తాత్కాలిక స్టే ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా తనను ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య రజనీకాంత్ తరపున బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. రజనీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరై తన క్లైంట్‌ను కలిసే అవకాశం దొరకలేదు కాబట్టి రజనీకాంత్‌ను కలిసి ఆయన సమాధానం తీసుకుని పిటిషన్ దాఖలు చేయడానికి కొంచెం వ్యవధి కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
విలన్‌కు ఓకే!
సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు జైలు గోడలు చూసిన హీరో సంజయ్‌దత్ ఆ తరువాత బాగా మారిపోయినట్టున్నాడు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి అందుబాటులో ఉన్న సినిమాలన్నీ చేసేస్తున్న ఇతగాడు... పూర్తిగా రూటు మార్చినట్టున్నాడు. హీరో అవకాశాల కోసం చూడకుండా... వచ్చినవి వచ్చినట్టు ఓకే చేస్తున్నాడు. అగ్నిపథ్‌లో విలన్‌గా చేసిన ఈ బాహుబలి... ఇప్పుడూ అదే బాటలో వెళుతున్నాడు. కరణ్ మల్హోత్రా తీస్తున్న ‘శుద్ధి’ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది జూలై- ఆగస్టుల్లో ఎర్రవాడ జైలు నుంచి సంజయ్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన తరువాత ఇదే తొలి చిత్రం అవుతుంది. కరణ్‌జోహార్ దీనికి నిర్మాత. సల్మాన్ హీరో! -
రజనీకాంత్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు. భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ ప్రశంసించారు. శుక్రవారం రజనీకాంత్ 63వ జన్మదినోత్సవం. ఆయన నటించిన లింగ ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు కూడా ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుక్రవారం రజనీ,శరద్ పవార్లకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శరద్ పవార్ ఇంట్లో జారి పడి... కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన కాలికి ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం శరద్ పవార్ ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. -
త్రివిక్రమ్ డైరెక్షన్లో స్టార్ హీరోలు
-
రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు
చెన్నై: రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ చురకలంటించారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే రాజకీయాల్లోకి రావాలని రజనీకి ఆమె హితబోధ చేశారు. అంతేకాని కాసేపు వస్తాను, మరి కాసేపు రానంటూ కుప్పిగంతులు వేయొద్దని కుష్బూ ఆయనకు సూచించారు. కుష్బూ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బాగు చేయాలని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందన్నారు. ఆమె రెండు రోజుల క్రితం డీఎంకే పార్టీకి రాజీనామా చేసి.... సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కుష్బూ బీజేపీలో చేరతారని గత కొంత కాలంగా మీడియాలో కథనాలు వెల్లువెత్తతున్నాయి. అయితే ఆమె హస్తం పార్టీలో చేరి ఆ కథనాలకు పుల్ స్టాప్ పెట్టారు. -
రాజకీయాల్లోకి రాను : రజనీకాంత్
పనాజీ: తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలో ప్రారంభమైన 45వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రజనీ మాట్లాడుతూ... రాజకీయాలలో చేరాలని తనను పలు పార్టీలు ఇప్పటికే ఆహ్వానించాయని, అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా తనకు రాజకీయాలంటే భయం మాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీదగా రజనీ సెంటినరీ అవార్డు ఫర్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. అమితాబ్, మీరు కలసి భవిష్యత్తులో కలసి నటిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా అందుకు రజనీ చిరునవ్వే సమాధానమిచ్చారు. కాగా రజనీ నటించిన తాజా చిత్రం లింగా డిసెంబర్ 12న విడుదల కానుంది -
మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే మహేశ్ బాబుకు చంటి అడ్డాల వినిపించారు. ఆ చిత్రంలో నటించేందుకు మహేష్ అంగీకరించారు. కానీ ప్రస్తుతం తాను పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నానని ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించాలని శ్రీకాంత్ అడ్డాలను మహేశ్ బాబు కోరారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే మహేశ్ హీరోగా ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రంలో మహేష్ బాబు నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ హీరో వెంకటేష్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. -
పడి లేచిన కెరటం!
అమితాబ్‌కు పరాజయం కొత్తేమీ కాదు. చాలా పాత చుట్టం. అయితే ఆ చుట్టాన్ని చూసి బెదిరి పోలేదు. చిన్నబుచ్చుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. విజయపతాకాన్ని ఎగరేశారు. అమితాబ్ రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ కాలేదు. హీరో కావడానికి సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు- ‘‘ఈ గొంతుతో ఎలా హీరో అవుదామనుకున్నావయ్యా!’’ అని ఒకరు. ‘‘ఇంత ఎత్తుతో ఎలా హీరో అవుతావు!’’ అని ఒకరు. ఒక్కరా ఇద్దరా? అమితాబ్ మనసు విరిగే మాటలెన్నో వినబడేవి. అయితే అవి అతని పట్టుదలను రెట్టింపు చేశాయి తప్ప నిరుత్సాహం నింపలేదు. సూపర్‌స్టార్ అయ్యేవరకు మడమ తిప్పలేదు. ‘అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్’ లిమిటెడ్ (ఎ.బి.సి.ఎల్). పేరుతో సొంత కంపెనీ మొదలుపెట్టారు బిగ్‌బి. ఈ కంపెనీ నుంచి విడుదలైన తొలి సినిమా ‘తేరే మేరే సప్నే’ పరాజయం మూటగట్టుకుంది. ‘ఎ.బి.సి.యల్’ భవిష్యత్‌కు ఇదో సూచనలా మిగిలింది. యాక్షన్ హీరోగా మరోసారి పలకరించడానికి 1997లో ‘మృత్యుదాత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు అమితాబ్. తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా పరాజయం పొందింది. నష్టాలు తెచ్చింది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో నష్టాలు. ఒకానొక దశలో కంపెనీ ఊహించని రీతిలో దివాళా తీసింది. ఇండియన్ ఇండస్ట్రీస్ బోర్డ్ ‘ఎ.బి.సి.ఎల్’ను ‘ఫెయిల్డ్ కంపెనీ’గా ప్రకటించింది. నష్టాల నుంచి కోలుకోవడానికి బాంబేలోని బంగ్లాను, రెండు ఫ్లాట్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ‘‘అమితాబ్ పని అయిపోయింది’’ అనుకున్నవాళ్లు ఉన్నారు. ‘‘అంత పెద్ద స్టార్ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది’’ అని జాలి పడిన వాళ్లు ఉన్నారు. అమితాబ్ మాత్రం ఓటమిని చూసి పలకరింపుగా నవ్వారు. ఆ నవ్వులో ‘నేను మళ్లీ గెలుస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉట్టిపడింది. యాభై అయిదు సంవత్సరాల వయసులో మరో విజయం కోసం నడుం బిగించాడు. అప్పుడంటే యవ్వనోత్సాహం ఉంది. సంపూర్ణ ఆరోగ్యం ఉంది. ఒక్కసారి కిందపడినా పదిసార్లు లేచే ఓపిక ఉంది. మరి ఇప్పుడు? ఉత్సాహం ఉందిగానీ...వయసు తోడుగా లేదు. ఆరోగ్యం ఉందిగానీ...సంపూర్ణ ఆరోగ్యం లేదు. అప్పటితో పోల్చితే ‘లేదు’లు బోలెడు ఉన్నాయి. అయితే ఆయన దగ్గర ఈ వయసులోనూ ఒకే ఒకటి ఉంది. ‘ఒక్కసారి కింద పడినా పదిసార్లు లేచే శక్తి’ ‘తనలోని శక్తి ఏమిటో కనుగొనేవాడే..నిజమైన శక్తిమంతుడు’ అంటారు. మరి తనలోని శక్తి ఏమిటి? వ్యాపారం...కాదు. రాజకీయాలు...కాదు. తన శక్తి ఏమిటో తనకు తెలుసు. అదే ‘నటన’ ఏ నటనతోనైతే తాను పైగా ఎదిగాడో, అదే నటనతో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు. ‘బడే మియా చోటే మియా’(1998) సినిమాతో కొద్దిగా పైకి లేచి యశ్‌చోప్రా ‘మహబ్బతే’(2000)తో విజయం అనే క్రీజ్‌లో నిలుదొక్కుగోలిగారు. సినిమా నటులు బుల్లితెరపై నటించడాన్ని తక్కువగా చూసే రోజుల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో బుల్లితెరకు కొత్త వెలుగు ఇచ్చారు. తన విజయ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు అమితాబ్ వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ‘ఓటమి’ భూతం కనికరం లేకుండా అతడిని పలకరించినా... మళ్లీ లేచి కాలరు ఎగరేసే సత్తా ఆయనకు పుష్కలంగా ఉంది. -
అఖిల్ మంచి స్టార్ అవుతాడు
‘‘అఖిల్‌లో నాకు భవిష్యత్ స్టార్హీరో కనిపించాడు’’ అంటున్నారు మహేశ్‌బాబు. ఇటీవలే ఆయన ‘మనం’ సినిమాను చూశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు మహేశ్.‘‘అనుకోకుండా తళుక్కున మెరిసిన అఖిల్ అతిథి పాత్ర నన్ను ఆశ్చర్యానికి లోనుచేసింది. అతను చాలా హుందాగా కనిపించాడు. ఆ అబ్బాయి వెండితెరపై చాలా బాగున్నాడు.కచ్చితంగా మంచి స్టార్ అవుతాడు’’ అని ట్విట్టర్లో అఖిల్ గురించి వ్యాఖ్యానించారు మహేశ్.అలాగే ఈ సందర్భంలో ‘మనం’ సినిమాను కూడా ప్రశంసల్లో ముంచెత్తారాయన.‘‘‘మనం’ నాకు చాలా బాగా నచ్చింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడున్న తెలుగు దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఆలోచించాడు దర్శకుడు. ఏది ఏమైనా అక్కినేని కుటుంబానికి ఓ గొప్ప సినిమా లభించింది’’ అని ట్వీట్ చేశారు మహేశ్. -
తెలుగు తెర సాంకేతిక విప్లవకారుడు
వంద అడుగుల ఎత్తు నుంచి దూకడం, డూప్ లేకుండా పోరాటాలు చేయడం.. ఇది కాదు సాహసం అంటే. సాహసం అంటే... ఏటికి ఎదురీదడం. మదగజాలను ఢీ కొట్టడం. అనుకున్నది సాధించేవరకూ అవిశ్రాంతంగా పోరాటం సాగించడం. కెరీర్ ఆసాంతం కృష్ణ చేసింది అదే. ‘అసలు ఇతను హీరో ఏంటి? మంచి రంగూ, ఒడ్డూ పొడుగు ఉన్నంత మాత్రన హీరోలైపోతారా’ అని హేళనగా మాట్లాడిన వారి నోటితోనే... ‘హీరోయిజానికి ఇతనే చిరునామా’ అనేట్లు చేసిన నిత్య కృషీవలుడు కృష్ణ. ‘దేవదాసు, కురుక్షేత్రం, అల్లూరి సీతారామరాజు’ చిత్రాలతో మహానటులకే సవాలు విసిరిన ధీశాలి కృష్ణ. ఆవేశం, ఆత్మ విశ్వాసం కృష్ణకు ఆభరణాలు. అవే ఆయనను ‘సూపర్‌స్టార్’ను చేశాయి. అందుకు ఉదాహరణగా కృష్ణకు సంబంధించిన ఓ సంఘటనను గుర్తు చేసుకోవాలి. ‘తేనెమనసులు’ విడుదలయ్యాక ప్రశంసలన్నీ అందులోని మరో హీరో రామ్మోహన్నూ, విమర్శలన్నీ కృష్ణనూ వరించాయి. ఆ పరిణామానికి ఆయన కుంగిపోలేదు. మద్రాస్‌లో తన మిత్రులందరి ముందు ‘నంబర్‌వన్ అనిపించుకు తీరుతా’ అని ఛాలెంజ్ చేశారు. కృష్ణ ఆ సవాల్ విసిరినప్పుడు అక్కడున్న ఆయన మిత్రులెవరో తెలుసా? శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, రామ్మోహన్. వారందరి ముందు ఛాలెంజ్ చేయడమే కాదు. అనుకున్నది సాధించారు కూడా. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత తెలుగు తెరపై ‘నంబర్‌వన్’గా భాసిల్లారు. ఒక స్టార్‌గానే కాదు, నటునిగా కూడా కృష్ణ చేసిన ప్రయోగాలు అసాధారణమైనవి. హీరోగా తన మూడో సినిమా ‘గూఢచారి 116’ చిత్రంలో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే మగధీరునిగా కనిపించిన కృష్ణ... ఆ వెంటనే వచ్చిన బాపుగారి ‘సాక్షి’ సినిమాలో పిరికితనం, అమాయకత్వంతో కూడిన పాత్రను పోషించి భళా అనిపించారు. ‘అల్లూరి సీతారామరాజు’లో అయితే... మహానటులకు దీటైన నటన కనబరిచి తెలుగుతెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. ‘కృష్ణావతారం, ఈనాడు, ముందడుగు, రక్తసంబంధం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, సింహాసనం..’ ఇత్యాది చిత్రాలు కృష్ణ అసాధారణ నటనకు తార్కాణాలు. తెలుగు సినిమాను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహనీయుల్లో కృష్ణ ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలుగుతెరపై సాంకేతిక విప్లవకారుడాయన. కృష్ణ అప్పట్లో నాలుగు షిఫ్ట్‌లు పనిచేసేవారు. ఒకే స్టూడియోలో ఎక్కువ ఫోర్లలో ఆయన షూటింగులే జరుగుతుండేవి. కాసేపు నిద్రపోవాలనుకుంటే... ‘సార్... మా కాస్ట్యూమ్స్ వేసుకొని పడుకోండి... మా సినిమాలో మీరు నిద్రపోతున్న షాట్స్ కొన్ని ఉన్నాయి. అవి తీసుకుంటాం’ అని దర్శకులు అడిగే స్థాయిలో సాగేది అప్పట్లో కృష్ణ ప్రభ. విరివిగా సినిమాలు చేసి... వేలాది కళాకారులకు ఆసరాగా నిలిచారాయన. ఇప్పటికి కృష్ణ 344 చిత్రాల్లో నటించారు. మంచి పాత్ర వస్తే ఇంకా నటించడానికి ఆయన సిద్ధం. ఎందుకంటే... కృష్ణకు నాగరా శబ్దాలంటే ఇష్టం. ఆర్క్ లైట్ల కాంతులంటే ఇష్టం. ‘షాట్ రెడీ... యాక్షన్... కట్’ అనే కేకలంటే ఇష్టం. నిరంతరం కోలాహలం మధ్య బతకడం ఇష్టం. అభిమానులతో మమేకమైపోవడం ఇష్టం. మొత్తంగా ఆయనకు సినిమా అంటే ఇష్టం. సినిమాను ప్రేమిస్తారు.. శ్వాసిస్తారు కాబట్టే... అభిమానులు ఆయనను అంతగా ఆరాధిస్తారు. నేటితో కృష్ణ 72వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయన వెంటే ఉన్నారు.. ఉంటారు కూడా. ఎందుకంటే... కృష్ణారాధన వారికొక వ్యసనం.