దటీజ్‌ రజనీకాంత్‌..! | Rajinikanth is real superstar | Sakshi
Sakshi News home page

దటీజ్‌ రజనీకాంత్‌..!

Published Mon, Nov 21 2016 1:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

దటీజ్‌ రజనీకాంత్‌..!

దటీజ్‌ రజనీకాంత్‌..!

  • రజనీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అక్షయ్‌కుమార్‌

  • ‘రజనీ సర్‌ ఒక సూపర్‌ స్టార్‌ కాదు. ఆయన ఎంటైర్‌ గెలాక్సీ (పాలపుంత). సిగరెట్‌ను కాల్చడంలో అయినా, కోటును స్టైలిష్‌గా సరిచేసుకోవడంలో అయినా ఆయన స్టైల్‌ ఆయనదే. ఆయన స్టైల్‌ నుంచి నేర్చుకోని వారు ఎవరూ ఉండరు’ అంటూ అక్షయ్‌కుమార్‌ సౌతిండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. శంకర్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రోబో-2 (2.0) సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. గతంలో తన సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కానప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రజనీ డబ్బులు వాపస్‌ ఇచ్చారని తెలుసుకొని తాను అబ్బురపడ్డానని, అదీ రజనీ గొప్పతనమని అన్నారు.

    ‘ నాకు గుర్తుంది ఆయన సినిమా ‘బాబా’  పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన డిస్ట్రిబ్యూటర్లను పిలిచి మరీ డబ్బులు ఇచ్చారు. ఆయన నిజమైన సూపర్‌ స్టార్‌ అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏం కావాలి’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. తన 25 ఏళ్ల కెరీర్‌లో తాను ఎప్పుడూ పెద్దగా మేకప్‌ వేసుకోలేదని, కానీ రోబో-2 సినిమాలో విలన్‌ పాత్ర కోసం మేకప్‌ వేసుకోవడానికి మూడు గంటలు, మేకప్‌ తీయడానికి ఒక గంట తనకు పట్టేదని చెప్పారు. తనకు మేకప్‌ వేస్తున్నంతసేపు తాను టీవీలో సినిమాలు చూస్తుండేవాడిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement