సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్ళీ మేకప్ వేసుకొంటున్నారు. గత ఏడాది విడుదలైన ‘లింగ’ చిత్రం తరువాత కెమేరా ముందుకు రాని ఆయన మరో వారంలో కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలోని ఈ సినిమా టైటిల్, ఇందులో రజనీ పాత్ర ఏమై ఉంటాయా అని కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ‘కాళి’ అనే పేరు పెడతారని ఇప్పుడు కోడంబాకమ్‌లో వినవస్తోంది. అన్నట్లు, రంజిత్ గత చిత్రమైన సూపర్‌హిట్ ‘మద్రాస్’లో కథానాయకుడు కార్తీ పోషించిన పాత్ర పేరు కూడా కాళీయే! ఆ సినిమాకు మొదట్లో ‘కాళి’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తీరా చివరకు ‘మద్రాస్’ అని తుది టైటిల్ ఖరారు చేశారు. కాగా, 1980లలోనే రజనీకాంత్ ‘కాళి’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు అదే టైటిల్ రజనీ తాజా సినిమాకూ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది మరో సస్పెన్స్‌గా ఉంది. ఈ పాత్రకు విద్యాబాలన్, రాధికా ఆప్టే లాంటి పలువురిని అనుకున్నా, ఇప్పటి దాకా ఎవరూ ఖరారు కాలేదు. రజనీకాంత్‌తో పాటు ప్రకాశ్‌రాజ్, దినేశ్, కలై అరసన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక వివరాల కోసం కొద్దిరోజులు ఆగాల్సిందే!
Published Fri, Jul 24 2015 9:48 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement