Young director
-
టాలీవుడ్లో మరో విషాదం.. కరెంట్ షాక్‌తో డైరెక్టర్ మృతి
Tollywood Young Director Paidi Ramesh Passed Away With Current Shock: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం (ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అదే రోజు టాలీవుడ్‌కు చెందిన యంగ్ డైరెక్టర్ కన్నుమూశారు. డైరెక్టర్ పైడి రమేష్ ఓ భవనంపై నుంచి జారిపడి చనిపోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పైడి రమేష్ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా షాక్ కొట్టి కింద పడి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైడి రమేష్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా పైడి రమేష్ 'రూల్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2018లో విడుదల అయింది. అయితే ఈ సినిమా అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు పైడి రమేష్. ఇంతలోనే ఈ ఘటన జరగడం పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదవండి: హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూత గుండెపోటుతో ప్రముఖ సీనియర్ నటుడు మృతి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైజాగ్ టు టాలీవుడ్.. వెండితెరపై విశాఖ యువకుడు
కొమ్మాది(భీమిలి)/విశాఖపట్నం: విశాఖ అంటే ప్రకృతి అందాలకు పుట్టినిల్లే కాదు.. అపర్ణ, గౌతమి, రమణ గోగుల, రాజా, సుత్తివేలు, గొల్లపూడి మారుతీరావు, శుభలేఖ సుధాకర్, వైజాగ్ ప్రసాద్, సుమన్‌శెట్టి, కులశేఖర్ లాంటి ఎంతో మంది నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులకు జన్మనిచ్చింది. అందుకే సినిమా అంటేనే ముందుగా గుర్తొచ్చేది విశాఖపట్నమే. వీరందరి స్ఫూర్తితో విశాఖ నుంచి టాలీవుడ్ బాటపట్టారు సాగర్‌నగర్‌కు చెందిన పోలుబోతు రవిశంకర్ నాయుడు. చదవండి: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో ట్రైలర్.. ఫాన్స్‌కు పూనకాలే! తక్కువ ఖర్చుతో.. స్థానిక నటులతో.. విశాఖ పరిసర ప్రాంతాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా తీసి.. వెండి తెరకు పరిచయమయ్యారు. అంతే కాదు.. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మరో రెండు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్వాతి చినుకు సంధ్య వేళలో సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆయన రెండో సినిమా బండెనక బండికట్టి చిత్రీకరణలో ఉంది. మార్చి 5న ది నన్స్ డైరీ పేరుతో మరో సినిమా చిత్రీకరించేందుకు రవిశంకర్ సిద్ధమవుతున్నారు. దర్శకుడు రవిశంకర్ అంతా విశాఖే.. డిప్యూటీ కలెక్టర్ తమ్మారావు, త్రివేణి దంపతుల కుమారుడు రవిశంకర్ విశాఖలోనే పుట్టి పెరిగారు. ఎంబీఏ చేసిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఓ కథను తయారు చేసుకుని.. తానే దర్శకత్వం వహించారు. ఆ సినిమాయే స్వాతి చినుకు సంధ్య వేళలో. ఈ నెల 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా మొత్తం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రూ.45 లక్షల వ్యయంలో చిత్రీకరించి విజయం సాధించారు. విశాఖ యువతకు అవకాశం విశాఖలో షూటింగ్‌లకు అనువైన స్థలాలే కాదు.. ప్రతిభ కలిగిన వేలాది మంది కళాకారులు ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించాలన్నదే తన ధ్యేయమని దర్శకుడు రవిశంకర్ తెలిపారు. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తే తక్కువ పెట్టుబడితో సినిమాను అందంగా చిత్రీకరించవచ్చన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో కొత్త ఆశలు రాష్ట్ర విభజన తర్వాత సినీ పరిశ్రమ అంతా వైజాగ్ వైపు చూస్తుంది. ఈ క్రమంలో విశాఖలో స్టూడియోలు నిర్మించాలని, సినిమా చిత్రీకరణలు చేపట్టాలని ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టాలీవుడ్‌ను ఆహా్వనించారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో విశాఖ కళాకారులకు కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లయితే సినీ పరిశ్రమకు విశాఖ ఒక ఐకాన్ కానుందని రవిశంకర్ తెలిపారు. ఏడాదికి 3 సినిమాలు ఏడాదికి మూడు సినిమాలు తీయాలన్నదే తన ధ్యేయమని రవిశంకర్ తెలిపారు. ఇప్పటికే ఓ సినిమా విడుదల కాగా.. మరో సినిమా నిర్మాణంలో ఉంది. వచ్చే నెలలో మరో సినిమా ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. రవితేజతో సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. విశాఖ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన సినీ ప్రస్థానం ఇక్కడే ప్రారంభించినట్లు తెలిపారు. -
రూ.30 లక్షలు కావాలంటూ యువ దర్శకుడి కిడ్నాప్ డ్రామా!
సాక్షి, చెన్నై(తమిళనాడు): సినిమాల్లోకి రావాలని ఎంతోమంది కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో కష్టపడతారు. కానీ 24 ఏళ్ల ఔత్సాహిక దర్శకుడు దొడ్డిదారిన డబ్బులు సంపాదించి దాంతో ఎలాగైనా షార్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు. తీరా తన ప్లాన్ బెడిసికొట్టడంతో అందరి చేత చీవాట్లు తిన్నాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ వ్యక్తి షార్ట్ ఫిలిం తీయాలనుకున్నాడు. ఇందుకోసం తన తండ్రి పెన్సిలయ్య రూ.30 లక్షలు అడగ్గా ఆయన అంతమొత్తం ఇవ్వడం కుదరదని తిరస్కరించి కేవలం రూ.5 లక్షలు అప్పజెప్పాడు. దీంతో ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. 30 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది కూడా తెలంగాణకి తీసుకురావాలని, ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీనిపై పెన్సిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇదంతా ఫేక్ కిడ్నాప్ డ్రామా అని గుర్తించిన పోలీసులు ఇద్దరు స్నేహితులతో కలిసి ఉన్న సదరు యువకుడిని సికింద్రాబాద్‌లోని హోటల్ గదిలో పట్టుకున్నారు. విచారణలో పార్ట్ ఫిలిం కోసమే ఇదంతా చేశామని నేరం అంగీకరించడంతో పోలీసులు వారిని మందలించి పంపించివేశారు. -
విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. తాజాగా.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కుమార్ వట్టి(39) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు.ఈ సందర్భంగా కుమార్ వట్టి కుటుంబానికి ప్రగాఢసానుభూతి ప్రకటించారు. నరసన్నపేటకు చెందిన కుమార్ వట్టి 2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. శ్రీవిష్ణు హీరోగా, ప్రఖ్యాత ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీతోనే కుమార్ వట్టి దర్శకుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు పరుశురాం దగ్గర ‘యువత’ సినిమా అసిస్టెంట్‌గా పని చేశారు. ఆ తర్వాత సోలో, అంజనేయులు, సారొచ్చారు సినిమాలకు కూడా పనిచేశారు. 30 కి పైగా చిత్రాలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే డైరెక్టర్‌గా రెండో సినిమాకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే కుమార్ వట్టి అకాలమృతితో పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు, వట్టి కుమార్‌తో కలిసి పనిచేసిన పరిశ్రమకు చెందిన పలువురు కూడా సంతాపం తెలిపారు. అమానవీయ రాజకీయ సందర్బాన , ఈ నేలనేలంతా వల్లకాడై ,వలపోత చరిత్రని మిగిలుస్తోంది. మన పుణ్య భూమి ముఖ చిత్రం పై ఒక్కో మరణం ఒక్కో విషాద వాఖ్యముగా పరివ్యాప్తమవుతుంది . కరోనతో దూరమైన ఆత్మీయుడు ,దర్శకుడు కుమార్ వట్టి కి దు:ఖ విచలిత నేత్రాలతో ఆల్విదా! @vatti_kumar pic.twitter.com/Zz6C2MSYgr — v e n u u d u g u l a (@venuudugulafilm) April 30, 2021 చదవండి: ఆక్సిజన్ లెవల్స్: ప్రోనింగ్ టెక్నిక్ అంటే తెలుసా? -
షార్ట్‌కట్ కథలు... వైజాగ్ డైరెక్టర్ వెండితెర కలలు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): ఆ యువకుడు కలలు కన్నాడు.. అవి సాధించడానికి అహర్నిశలూ కష్టపడ్డాడు. ఓ పక్క చదువు, మరో వైపు రంగుల ప్రపంచం.. చదువు పూర్తయ్యేలోపు తన కలలను తెరపై చూసుకున్నాడు. విజయవంతంగా దూసుకుపోతున్నాడు. దర్శకుడిగా సత్తా చాటాలని, మంచి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని పరితపిస్తున్నాడు విశాఖకు చెందిన భూపతిరాజు సుమంత్‌వర్మ. స్టీట్ హర్ట్.. బ్రోకెన్ హర్ట్.. స్టీట్ హర్ట్ అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ ప్రారంభించిన సుమంత్ తరువాత వరుసగా బాటసారి, జోకర్స్, సినిమా చూపిస్తా మావా.. బాబూ బఠానీ, కాగితం, అదోరకం, కాస్త క్రేజీగా, ఎవరిదీ ప్రేమ వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా కృష్ణామృతం సినిమాతో అలరించాడు. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో విశాఖ కళాకారులు నటించారు. పక్కాలోకల్ మూవీ, యూనివర్సల్ సబ్జెక్ట్‌తో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తోంది. జోకర్ షార్ట్‌ఫిల్మ్ యూట్యూబ్ ప్రాబల్యం అంతగా లేనప్పుడే రెండు లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోయింది. ప్రస్తుతం ‘నా మహారాణి నువ్వే’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్టు సుమంత్ వర్మ తెలిపారు. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ‘చిన్నతనంలో ఎక్కువ సినిమాలు చూసేవాడ్ని.. డ్యాన్స్‌లంటే పిచ్చి. పాఠశాల, కళాశాలలో ఏ ఫంక్షన్ అయినా డ్యాన్స్ చేసేవాడ్ని...అయితే ఇంటర్ అయ్యాక దర్శకుడిగా మారాలని అను కున్నా.. ఈ రంగంలో బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. తల్లిదండ్రులు ప్రోత్సాహం తప్ప.. దీంతో డిగ్రీ వరకు చదువుపై శ్రద్ధపెడుతూనే చిన్నచిన్న కథలు రాసుకునేవాడ్ని.. డిగ్రీ కాగానే షార్ట్ ఫిల్మ్‌లు తీస్తూ ఆత్మ విశ్వాసం పెంపొందించుకున్నా.. అవి మంచి ఫలితాలు ఇవ్వడంతో వాటిపై పూర్తి దృష్టి పెట్టా..ప్రస్తుతం ఏయూలో ఎంఏ తెలుగు లిటరేచర్ చేస్తున్నాను’ అని సుమంత్ తెలిపారు. కుటుంబ నేపథ్యం ‘నాన్న బోర్డర్లో పనిచేసేవారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే వచ్చేశారు. లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. తరువాత విజయనగరంలోని సత్యాస్భారతి ఫౌండేషన్‌లో కొద్దికాలం పనిచేశారు. 2011లో ఆయన మృతి చెందారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవడంతో నేను హైదరాబాద్ వెళ్లలేకపోయాను. ఇక్కడ ఉంటూ నా కలలను నిజం చేసుకుంటున్నాను’ అని అన్నారు. టాలీవుడ్లో స్థిరపడతా.. ‘ఎప్పటికైనా టాలీవుడ్లో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకోవాలన్నదే నా డ్రీమ్. అందుకు ప్లాట్‌ఫారంగా షార్ట్‌ఫిల్మ్‌లను ఎంచుకున్నా.. కృష్ణామృతం సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. నేను రాసుకున్న కథలతో కచ్చితంగా టాలీవుడ్లో మంచి దర్శకుడిగా నిరూపించుకుంటానని నమ్మకం ఉంది’ అని సుమంత్ ముగించారు. చదవండి: గుడ్డి దెయ్యం కథ చూడలేదు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్.. వైరలవుతోన్న ఫోటోలు -
కాళిగా రజనీకాంత్?
-
మళ్లీ ప్రేమలోపడ్డ నయన?
కోలీవుడ్‌లో ఇప్పుడో కొత్త ప్రచారం హల్చల్ చేస్తోంది. నటి నయనతార మరోసారి ప్రేమలో పడిందన్నదే ఆ తాజా ప్రచారం. ఈ సంచలన తార ఓ యువ దర్శకుడితో సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ఆయన ఎవరో కాదు శింబు, వరలక్ష్మి నాయికా నాయకులుగా నటించిన పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన విఘ్నేష్ శివనే నట. సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న పోడాపోడి చిత్రం విడుదలానంతరం మాత్రం ఆడియన్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ను నిరాశనే మిగిల్చింది. ఆ ఎఫెక్ట్ శింబు, వరలక్ష్మితో పాటు దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు గట్టిగానే తగిలింది. చాలా రోజుల పోరాటం తరువాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు మలి అవకాశం వచ్చింది. దాన్ని నటుడు ధనుష్ కల్పించారు. ఆయన నిర్మిస్తున్న చిత్రం నానుమ్ రౌడీదాన్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కథానాయకుడు, కథానాయకి నయనతార. అంతకుముందు విఘ్నేష్ శివన్ ఎన్నైఅరిందాల్ చిత్రంలో అదారో అదారో పాటతో సహా కొన్ని చిత్రాల్లో పాటలు రాశారన్నది గమనార్హం. ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో చిన్న వేషం వేశారు. ఇలా ఆయనలోని టాలెంట్‌ను చూసే ధనుష్ దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉండవచ్చు. అయితే అది విఘ్నేష్ శివన్‌కు పరోక్షంగా నయనతారకు ప్రేమికుడవ్వడానికి దోహదపడి ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్లో నయనతార, విఘ్నేష్ శివన్ చాలా సన్నిహితంగా మెలుగుతున్నట్లు చిత్ర యూనిట్ గుసగుసలు. అంతేకాదు నయన తన తాజా ప్రేమికుడికి ఒక ఖరీదైన కారును కొనిచ్చారట. అదే విధంగా నయన్ ఇటీవల విఘ్నేష్ శివన్‌తో కలిసి మాల్దీవులకు జాలీ ట్రిప్ వేసి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సారైనా ఈ యువ దర్శకుడితో స్నేహం నయనతారను పెళ్లి పీటలెక్కిస్తుందా? అన్న ప్రశ్నకు పాజిటివ్ రిజల్ట్ వస్తోంది. -
యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన రజనీ
-
నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు
చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు. చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.