దీపావళి రేస్‌లో సూపర్‌స్టార్
దీపావళి, సంక్రాంతి వంటి పండగ రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలు తెరపైకి వస్తే ఆ సందర్భాలు వారి అభిమానులకు మరో పండగే. అలాంటిది ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం దీపావళికి విడుదలైతే ఆ సందడే వేరు. రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన చిత్రం ఏ భాషలో రూపొందినా అది పలు దేశాల్లో ప్రదర్శింపబడుతుంది. ఇకపోతే కారణాలేమైనా రజనీకాంత్ నటించిన చిత్రాలు ఈ మధ్య దీపావళి పండగకు తెరపైకి రావడం లేదు. పండగల సందర్భంగా తమ సూపర్‌స్టార్ చిత్రాలు విడుదల కావాలని ఆయన అభిమానులు కోరుకుంటుంటారు. అరుుతే రజనీకాంత్ హీరోగా కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ముత్తు చిత్రం 1995లో దీపావళి సందర్భంగా అక్టోబర్ మూడవ తేదీన విడుదలైంది.
ఆ తరువాత ఆయన నటించిన ఏ చిత్రం ఇప్పటి వరకూ దీపావళికి తెరపైకి రాలేదు. అలాంటిది 2017లో 2.ఓ చిత్రం దీపావళి పండగ సందర్భంగా విడుదల కానుంది. అంటే 21 ఏళ్ల తరువాత సూపర్‌స్టార్ నటించిన చిత్రం ఈ పండగకు రానుందన్న మాట. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రంపై అంచనాలు ఇప్పటికే తారా స్థారుుకి చేరుకున్నారుు. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నిపుణుల సృష్టితో అత్యధిక బడ్జెట్‌తో 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా సూపర్‌స్టార్ చిత్రం 2.ఓ రికార్డుకెక్కనుంది. ఇక ఈ చిత్రం తిరగరాసే రికార్డుల కోసం ఎదరుచూద్దాం.