రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు | Kushboo takes on Superstar Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు

Published Sat, Nov 29 2014 1:28 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు - Sakshi

రజనీ... రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదు

చెన్నై: రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ చురకలంటించారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే రాజకీయాల్లోకి రావాలని రజనీకి ఆమె  హితబోధ చేశారు. అంతేకాని కాసేపు వస్తాను, మరి కాసేపు రానంటూ కుప్పిగంతులు వేయొద్దని  కుష్బూ ఆయనకు  సూచించారు.

 

కుష్బూ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బాగు చేయాలని అన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందన్నారు. ఆమె రెండు రోజుల క్రితం డీఎంకే పార్టీకి రాజీనామా చేసి.... సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కుష్బూ బీజేపీలో చేరతారని గత కొంత కాలంగా మీడియాలో కథనాలు వెల్లువెత్తతున్నాయి. అయితే ఆమె హస్తం పార్టీలో చేరి ఆ కథనాలకు పుల్ స్టాప్ పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement