
అఖిల్ మంచి స్టార్ అవుతాడు
‘‘అఖిల్‌లో నాకు భవిష్యత్ స్టార్‌హీరో కనిపించాడు’’ అంటున్నారు మహేశ్‌బాబు. ఇటీవలే ఆయన ‘మనం’ సినిమాను చూశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు మహేశ్.‘‘అనుకోకుండా తళుక్కున మెరిసిన అఖిల్ అతిథి పాత్ర నన్ను ఆశ్చర్యానికి లోనుచేసింది. అతను చాలా హుందాగా కనిపించాడు.
ఆ అబ్బాయి వెండితెరపై చాలా బాగున్నాడు.కచ్చితంగా మంచి స్టార్ అవుతాడు’’ అని ట్విట్టర్‌లో అఖిల్ గురించి వ్యాఖ్యానించారు మహేశ్.అలాగే ఈ సందర్భంలో ‘మనం’ సినిమాను కూడా ప్రశంసల్లో ముంచెత్తారాయన.‘‘‘మనం’ నాకు చాలా బాగా నచ్చింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడున్న తెలుగు దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఆలోచించాడు దర్శకుడు. ఏది ఏమైనా అక్కినేని కుటుంబానికి ఓ గొప్ప సినిమా లభించింది’’ అని ట్వీట్ చేశారు మహేశ్.