మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం | Mahesh Babu may work with Srikant Addala again | Sakshi
Sakshi News home page

మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం

Published Sun, Oct 19 2014 12:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం

మహేశ్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల చిత్రం

చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే మహేశ్ బాబుకు చంటి అడ్డాల వినిపించారు. ఆ చిత్రంలో నటించేందుకు మహేష్ అంగీకరించారు. కానీ ప్రస్తుతం తాను పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉన్నానని ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభించాలని శ్రీకాంత్ అడ్డాలను మహేశ్ బాబు కోరారు.

వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్పైకి వచ్చే అవకాశం ఉంది.  అయితే మహేశ్ హీరోగా ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది.  ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రంలో మహేష్ బాబు నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ హీరో వెంకటేష్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement