మహేశ్‌ సార్‌, ప్లీజ్‌.. ఆ ఒక్క పని చేయండి: డ్రాగన్‌ డైరెక్టర్‌ | Return Of The Dragon Movie Director Ashwath Marimuthu Request To Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సార్‌ వల్లే ఆ సినిమా అందరూ చూశారు.. దయచేసి.. : డ్రాగన్‌ డైరెక్టర్‌

Published Mon, Mar 3 2025 7:04 PM | Last Updated on Mon, Mar 3 2025 7:30 PM

Return Of The Dragon Movie Director Ashwath Marimuthu Request To Mahesh Babu

లవ్‌ టుడే హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ ప్రధాన పాత్రలో నటించిన రిటర్న్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ సినిమా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డ్రాగన్‌ డైరెక్టర్‌ అశ్వత్‌ మారిముత్తు తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌ రాజమౌళిగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. ఎమోషన్స్‌ కనెక్ట్‌ అయితే టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌, కొరియన్‌వుడ్‌.. ఎక్కడైనా హిట్‌ అవుతుందని ఆయన చెప్తుంటారు. 

మహేశ్‌ గర్విస్తారు
ఈ ప్రపంచంలో ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనే మూడు ఎమోషన్స్‌ సాధారణంగా ఉంటాయి. ఈ మూడూ మా సినిమాలో ఉన్నందునే విజయం సాధించింది. మీ అందరికీ ఓ విజ్ఞప్తి.. నేను డైరెక్ట్‌ చేసిన ఓ మై కడవులే సినిమా రిలీజైనప్పుడు మహేశ్‌బాబు గారు దాని గురించి ఒక్క ట్వీట్‌ చేశారు. అంతే.. తెలుగు సినీప్రేక్షకులందరూ ఓ మై కడవులే వీక్షించారు. డ్రాగన్‌ సినిమాను ఆయన చూడాలని ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా మూవీ చూసి ఆయన గర్విస్తారనుకుంటున్నాను. దయచేసి ఈ సందేశాన్ని ఆయనవరకు చేరవేయండి.. సినిమా చూసేలా చేయండి అని కోరాడు.

డ్రాగన్‌ సినిమా
డ్రాగన్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కయాడు లోహర్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. కల్పతి అఘోరం, కల్పతి గణేశ్‌, కల్పతి సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

చదవండి: అమ్మాయితో చాటింగ్‌ వైరల్‌.. తన ఉద్దేశం అది కాదన్న హీరో
ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్‌ రంగనాథన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement