
జాకీచాన్
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్‌ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది.
అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్.
Comments
Please login to add a commentAdd a comment