రజనీకాంత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ | PM Narendramodi wishes to NCP Chief Sarad pawar and actor superstar RajiniKanth on their birthday | Sakshi
Sakshi News home page

రజనీకాంత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Published Fri, Dec 12 2014 9:30 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM

రజనీకాంత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ - Sakshi

రజనీకాంత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు  జీవించాలని మోడీ ఆకాంక్షించారు. భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ ప్రశంసించారు. శుక్రవారం రజనీకాంత్ 63వ జన్మదినోత్సవం. ఆయన నటించిన లింగ ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.


అలాగే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు కూడా ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  మోదీ శుక్రవారం రజనీ,శరద్ పవార్లకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శరద్ పవార్ ఇంట్లో జారి పడి... కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన కాలికి ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం శరద్ పవార్ ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement