రజనీకాంత్ కేసు వాయిదా | Case by Rajini against the hindi film adjourned | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ కేసు వాయిదా

Published Fri, Mar 20 2015 1:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

రజనీకాంత్ కేసు వాయిదా

రజనీకాంత్ కేసు వాయిదా

చెన్నై : హిందీ చిత్రం మేహూ రజనీకాంత్ విడుదలపై నిషేధం విధించాలంటూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును ఇంతకు ముందు విచారించిన న్యాయ స్థానం మైహూ రజనీకాంత్ చిత్రం విడుదల పై తాత్కాలిక స్టే ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా తనను ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన  న్యాయమూర్తి సుబ్బయ్య రజనీకాంత్ తరపున బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసేలా ఉత్తర్వులిచ్చారు.

ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. రజనీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరై తన క్లైంట్‌ను కలిసే అవకాశం దొరకలేదు కాబట్టి రజనీకాంత్‌ను కలిసి ఆయన సమాధానం తీసుకుని పిటిషన్ దాఖలు చేయడానికి కొంచెం వ్యవధి కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement