Hindi film
-
అవార్డులు కొల్లగొట్టిన మూవీ.. మూడేళ్లయినా ఎవరూ పట్టించుకోవట్లే!
థియేటర్లో రిలీజయ్యే పెద్ద సినిమాలతో పాటు చిన్నాచితకా చిత్రాలు కూడా ఈ రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అవార్డు గెలుచుకున్న సినిమాలైతే బాక్సాఫీస్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతున్నారు. కానీ తన సినిమాను మాత్రం ఎవరూ పట్టించుకోలేదంటున్నాడు దర్శకరచయిత రితేశ్ శర్మ.వారణాసి నేపథ్యంలో మూవీ..రితేశ్ తొలిసారి డైరెక్ట్ చేసిన చిత్రం జీనీ బీనీ చడారియా (ద బ్రిటిల్ థ్రెడ్). మేఘ మాథుర్, ముజఫర్ ఖాన్, శివన్ స్పెక్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వారణాసి నగరం, అక్కడి సాంప్రదాయాలు, జీవన శైలి ఆధారంగా తెరకెక్కింది. కొన్ని పరిస్థితుల వల్ల రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నది చూపించారు. 2021 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇంతవరకు అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవనేలేదు.రిజెక్ట్ చేస్తున్న ఓటీటీఈ మూవీని విడుదల చేసేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావడం లేదు. కనీసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినా తీసుకుందా? అంటే అదీ లేదు. ఈ క్రమంలో దర్శకుడు రితేశ్ శర్మ ఎక్స్ (ట్విటర్) వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. జీనీ బీనీ చడారియాను కొనేందుకు ఏ ఓటీటీ ఆసక్తి చూపించడం లేదు. ఇది నేను ఊహించిందే! రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాను కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీలు చెబుతున్నాయి అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. సినిమాకు ఇంత గడ్డు పరిస్థితి రావడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.అవార్డులు..కాగా జీనీ బీనీ చడారియా.. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ (2022)లో బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిలిం, ఇండోగ్మ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (సుప్రియ దాస్‌గుప్తా), ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ అహ్మద్‌నగర్‌లో ఉత్తమ నటి (మేఘ మాథుర్), ఉత్తమ ఎడిటర్ (భీష్మ ప్రతిం) అవార్డులు గెలుచుకుంది. ఇవే కాక మరెన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం. I'm not shocked to share that our film Jhini Bini Chadariya is still not able to get any platform in any OTT.OTT message for our film-We aren't in the position of acquiring a film which explores political matters. #ott #independentfilms #censor #cinema #release #freedom #time pic.twitter.com/w9DX37nUoE— Ritesh Sharma (@ritesh_films) June 26, 2024 View this post on Instagram A post shared by Ritesh Sharma (@ritesh_films)చదవండి: 'కల్కి' గెస్ట్ రోల్స్‌లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు -
మార్పు రావాలి
కథానాయికగా సౌత్, నార్త్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్ ధక్’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది. కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు, కో–స్టార్ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు. కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బు రికవర్ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్ ధక్’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. -
Hyderabad: నగరంలో ఓటీటీ మానియా.. హిందీ కంటెంట్‌కే ఓటు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓటీటీ వీక్షకుల్లో అత్యధికులు హిందీ కంటెంట్‌నే వీక్షిస్తున్నట్టు తేలింది. ఆ తరువాత స్థానం ఇంగ్లీష్ కంటెంట్‌కు దక్కింది. దాదాపు 52 శాతం మంది హిందీ, 28 శాతం మంది ఇంగ్లీష్ కంటెంట్లకు ప్రాధాన్యతనిస్తే, 14 శాతం మంది మాత్రమే తెలుగు కంటెంట్‌ను ఎంచుకుంటున్నారు. సుప్రసిద్ధ మార్కెటింగ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ రెడ్ మ్యాటర్ టెక్నాలజీస్ (ఆర్ఎంటీ)‘అండర్స్టాండింగ్ పెయిడ్ ఓటీటీ సబ్స్క్రైబర్స్ ఆఫ్ హైదరాబాద్’ అధ్యయన ఫలితాలను సోమవారం విడుదల చేసింది. దీని ప్రకారం..36 సంవత్సరాలు దాటిన వ్యక్తులలో 55 శాతం మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ చూడాలనుకుంటుంటే 26 ఏళ్ల లోపు వ్యక్తులు ఒంటరిగా వీక్షించాలనుకుంటున్నారు. అదే విధంగా ఓటీటీ వేదికల్లో..అగ్రగామిగా 70 శాతం వినియోగదార్లను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ప్రతి రోజూ 3 గంటలకు పైగా సమయాన్ని ఓటీటీ వీక్షణలోనే సిటీజనులు గడుపుతున్నారు. మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాలలో 10 శాతం అదనపు వ్యూయర్షిప్ ఉంటోంది. ఈ అధ్యయనం కోసం ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌పై చెప్పుకోదగ్గ మొత్తాన్ని ఖర్చు చేస్తున్న నెలకు రూ...60 వేలు ఆ పైన ఆర్జిస్తున్నవారిని ఎంచుకున్నామని ఆర్ఎంటీ సీఈఓ శ్రీకాంత్ రాజశేఖరుని తెలిపారు. -
క్యారే.. భారీ ప్లానా?
రజనీకాంత్‌ని రెండు సార్లు డైరెక్ట్ చేసి, క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు పా. రంజిత్. ‘కాలా’లో రజనీతో ‘క్యా రే సెట్టింగా?’ అనిపించిన రంజిత్ ఓ హిందీ చిత్రం తెరకెక్కిస్తారన్న వార్త వచ్చిన సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ మూవీ అని సమాచారం. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఓ యోధుని జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందట. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లోని చాలామంది స్టార్స్ నటించబోతున్నారట. ఓ ముఖ్య పాత్రలో ఆమిర్ ఖాన్ కూడా నటించొచ్చు అనే వార్త బీటౌన్‌లో షికారు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటుగా సిల్క్ స్మిత బయోపిక్‌ను టీవీ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు పా. రంజిత్. -
మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్
ముంబయి : తాను మరో 70 ఏళ్లు కూడా బాలీవుడ్ చిత్ర సీమలో ఉండగలనని ప్రముఖ నటి సోనాక్షి సిన్హా అన్నారు. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఆదివారంనాటికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన అభిమానుల ద్వారానే ఇండస్ట్రీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. తొలిసారి దబాంగ్ చిత్రం (2010) ద్వారా సల్మాన్‌ఖాన్ సరసన నటిస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, నాయకుడు శత్రఘ్నసిన్హా కూతురు అయిన సోనాక్షి తొలినాళ్లలో నటించిన చిత్రాలు అన్నీ కూడా వరుసగా బంపర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బాలీవుడ్లో ఫేమస్ హీరోయిన్గా మారిపోయారు. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవడంతో ట్విట్టర్ ద్వారా తనకు దబాంగ్‌లో అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అభినవ్ కశ్యప్‌కు ధన్యవాదాలు చెప్పారు. అలాగే, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'నాపైన ప్రేమ చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. మరో 70 ఏళ్లు కూడా ముందుకు సాగగలనని చెప్పగలుగుతున్నానంటే అది మీవల్లే' అని తెలిపారు. -
‘బాలీవుడ్లో నటించేందుకు నాకు ఇబ్బంది లేదు’
ముంబయి: తనకు బాలీవుడ్ లో పనిచేయాడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ భారత సంతతికి చెందిన అమెరికా నటి ఫ్రిదా పింటో చెప్పింది. స్లమ్ డాగ్మిలియనీర్ చిత్రంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆమె హిందీ చిత్రాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తాను మార్వారి చిత్రం ‘త్రిష్నా’లో సగభాగం నటించానని, ఆ భాష కూడా తనకు రాకపోయినా ఆ పని చేశానని తెలిపింది. సినిమాలో ఎవరు నటిస్తున్నారనే దానికంటే ఆ సినిమా కథ ఎలా ఉందనేదే తనకు ముఖ్యం అని ఫ్రిదా చెప్పింది. వచ్చే ఏడాది తాను గొప్ప చిత్రంలో కనిపిస్తానని, అది కూడా స్లమ్ డాగ్మిలియనీర్ నిర్మాతల్లో ఒకరైన తాబ్రెజ్ నూరాని దర్శకత్వం వహించారని, ఆయన కూడా భారతీయుడే అని ఫ్రిదా తెలిపింది. -
అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!
సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు. -
మన్మోహన్ సింగ్ కథతో బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎక్కువగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాలనే వెండితెర మీద ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఓ పొలిటికల్ లీడర్ జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది కూడా ఈ జనరేషన్ మొత్తానికి తెలిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా కావటంతో.. ఈ వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. నాలుగేళ్ల పాటు మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు రాసిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ - ద మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ బోరా ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి కీలక పాత్రలకు నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసిన ఆగస్టు 30న ఫస్ట్ లుక్‌ను, 2017లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను దాదాపు 12 భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ధోని జీవిత కథతో భూమిక రీఎంట్రీ
తమిళసినిమా: ప్రముఖ క్రికెటర్ ధోని జీవిత ఇతివృత్తంతో తెరకెక్కనున్న హిందీ చిత్రం ద్వారా నటి భూమిక రీఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందిన నటి భూమిక. తమిళంలో రోజాకూట్టం చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత సూర్య సరసన చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంతో పాటు కొన్ని చిత్రాలు చేసి ప్రాచుర్యం పొందారు. తెలుగులోనూ సింహాద్రి, మిస్సమ్మ తదితర పలు చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే యోగా మాస్టర్ భరత్‌ఠాగూర్ ప్రేమలో పడి 2007లో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భర్తను నిర్మాతగా చేసి తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం భూమికను తీవ్ర నష్టాలకు గురి చేయడంతో భర్తతో మనస్పర్థలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ మధ్య భరత్‌ఠాగూర్ నుంచి విడిపోయినట్లు తన ట్విట్టర్లో పేర్కొన్న భూమిక ఆ వెంటనే దాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న భూమిక ఇప్పుడు ధోని జీవిత కథా చిత్రంతో రీఎంట్రీ కానున్నారు. దీని గురించి భూమిక తెలుపుతూ తాను 2007లో గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదని మళ్లీ ఇన్నాళ్లకు క్రికెటర్ ధోని జీవిత కథతో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు చెప్పారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. అయితే చాలా ముఖ్యపాత్ర అని మాత్రం చెప్పగలనని అన్నారు. -
‘ఆల్ ఈజ్ వెల్’కు డాక్టర్ ఆర్థో ప్రమోషన్
ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ఆల్ ఈజ్ వెల్ ఘన విజయం సాధించాలన్న ఆకాంక్షను ‘ఎస్బీఎస్ బయోటెక్’ వ్యక్తంచేసింది. ఈ సంస్థ కీళ్ల నొప్పులకు మందుగా ‘డాక్టర్ ఆర్థో’ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తీ తన జీవనగమన గమనంలో ఎదుర్కొనే కష్టనష్టాలు సంబంధిత కుటుంబంపై ప్రభావం చూపుతాయన్న కథాగమనం.. ఎస్బీఎస్ బయోటెక్‌ను ఆకర్షించినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో సంబంధిత వ్యక్తి ఆరోగ్యాన్ని, వంటి నొప్పులను సైతం పట్టించుకోడని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ ఆర్థో ఉత్పత్తి బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చిత్ర ప్రమోషన్‌కు సంబంధించి న్యూఢిల్లీలో జరిగిన ‘మీట్-గ్రీట్’ కార్యక్రమంలో చిత్ర యూనిట్, ఎస్బీఎస్ బయోటెక్ సిబ్బంది పాల్గొన్నారు. -
రజనీకాంత్ కేసు వాయిదా
చెన్నై : హిందీ చిత్రం మేహూ రజనీకాంత్ విడుదలపై నిషేధం విధించాలంటూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసును ఇంతకు ముందు విచారించిన న్యాయ స్థానం మైహూ రజనీకాంత్ చిత్రం విడుదల పై తాత్కాలిక స్టే ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా తనను ప్రతివాదిగా చేర్చాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుబ్బయ్య రజనీకాంత్ తరపున బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసేలా ఉత్తర్వులిచ్చారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు వచ్చింది. రజనీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు హాజరై తన క్లైంట్‌ను కలిసే అవకాశం దొరకలేదు కాబట్టి రజనీకాంత్‌ను కలిసి ఆయన సమాధానం తీసుకుని పిటిషన్ దాఖలు చేయడానికి కొంచెం వ్యవధి కావాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
తెల్ల చీరలో తడవడమా?
సాధారణంగా వానపాటల్లో నాయికలు తెల్లచీర ధరించి అందాలారబోయడం పరిపాటి. సీనియర్ నటీమణుల నుంచి ఈ తరం నాయికల వరకు చాలామంది అలా తడి తడి అందాలు ఆరబోసినవారే. ఆ మధ్య తమన్న తెలుగు చిత్రం రచ్చలోను, తమిళ చిత్రం పైయ్యాలోను ఈ తరహా అందాలారబోశారు. అలాంటిది పెద్దగా అవకాశాలు లేకపోయినా తాప్సీ బికినీ లాంటివి ధరించేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తుందట. అంతేకాదు తెల్లచీర ధరించి వాన పాటల్లో నటించడానికి ససేమిరా అంటోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ కొన్ని చిత్రాల్లో తనను ఈత దుస్తుల్లో ధరించి నటించమన్నారని అందుకు సరిపడే శరీరాకారం తనకు లేదని అనుకుంటున్నానన్నారు. ఏదేమైనా తాను నటించే చిత్రాల్లో దుస్తులు విషయంలో చాలా శ్రద్ధ చూపుతానని చెప్పింది. సమీపకాలంలో ఒక హిందీ చిత్రం కోసం తెల్లచీర ధరించి వానపాటలో నటించమని అన్నారని అందుకు తాను అంగీకరించలేదని అన్నారు. చివరికి వేరే కలర్ చీరతో వర్షంలేకుండా ఆ చిత్రంలో నటించానని తాప్సీ తెలిపింది. -
వచ్చే ఏడాది హిందీ సినిమా చేస్తా!
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య.. ఇలా సినిమా సినిమాకీ నటునిగా పరిణతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన కథానాయకునిగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘జోరు’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు. ‘గుండెల్లో గోదారి’ టైమ్‌లోనే కుమార్ నాగేంద్ర, నేనూ ఓ సినిమా చేయాలనుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. పూర్తి స్థాయి కామెడీ సినిమా చేద్దామని చివరకు నాగేంద్రే అన్నాడు. నాక్కూడా ఆ ఆలోచన నచ్చింది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకుల్ని నవ్వించడమే పరమావధిగా ఈ సినిమా చేశాం. కామెడీ కథల పరంగా ఇప్పటి వరకూ రాని కథాంశంతో ఈ సినిమా చేశాం. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ... ఈ సినిమాలో రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ కథానాయికలు. ఈ ముగ్గురూ ఒకే పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర పేరు అన్నపూర్ణ. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ, చూస్తేనే మజా ఉంటుంది. అలాగే... ఇందులో నాకు ఇద్దరు అమ్మానాన్నలుంటారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ చిత్రాల శైలిలో కన్ఫ్యూజన్తో కూడిన కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. అక్కడ మంచి పేరు తెచ్చింది ‘షోర్ ఇన్ ది సిటీ’ చిత్రం బాలీవుడ్లో నాకు మంచి పేరు తెచ్చింది. అయితే... తెలుగులో బిజీగా ఉండటం వల్ల మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయలేకపోయాను. వచ్చే ఏడాది ఓ హిందీ సినిమా చేస్తా. ఇక ఇక్కడి విషయానికొస్తే - కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. అలాగే ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఆనంద్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నా. మరో తమిళ సినిమా కూడా ‘ఓకే’ చేశా. -
సవతి తల్లిగా..!
ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రం ద్వారా వెండితెరపై మెరిసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత హిందీలో వేరే ఏ సినిమా అంగీకరించలేదామె. తమిళంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కీలక పాత్ర చేయడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు. ఈ సినిమా అంగీకరించిన కొన్ని రోజులకే హిందీలో ఆమె ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ స్వయంగా చెప్పారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. కథ బాగా నచ్చడంవల్ల తానే నిర్మించాలనుకున్నానని బోనీ తెలిపారు. ఈ చిత్రంలో పద్ధెనిమిదేళ్ల కూతురికి శ్రీదేవి సవతి తల్లిగా నటించనుంది’’ అని బోనీ పేర్కొన్నారు. ఇందులో శ్రీదేవి కూతురిగా కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత మళ్లీ ఆ స్థాయికథ దొరికితేనే శ్రీదేవి నటించాలనుకుందని, ఈ చిత్రకథ ఆమెకు పూర్తి సంతృప్తినిచ్చిందని బోనీ కపూర్ తెలియజేశారు.