అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు! | Illeana about her cinema career | Sakshi
Sakshi News home page

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

Published Mon, Oct 24 2016 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు! - Sakshi

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్‌లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది.

మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement