అలాంటి అమ్మాయిలెందరో! | ileana about chances in movie | Sakshi
Sakshi News home page

అలాంటి అమ్మాయిలెందరో!

Published Sun, Jan 8 2017 2:34 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అలాంటి అమ్మాయిలెందరో! - Sakshi

అలాంటి అమ్మాయిలెందరో!

సినిమా వ్యామోహంతో జీవితాలను కోల్పోతున్న అమ్మాయిలెందరో అని అంటోంది నటి ఇలియానా. దక్షిణాదిలో నేమ్‌ తెచ్చుకుని, బాలీవుడ్‌లో ఫేమ్‌ కోసం పోరాడుతున్న నటి ఈ భామ. సాధారణంగా అవకాశాలు లేనప్పుడే నటీమణులు ప్రచారం కోసం దారులు వెతుకుతుంటారని ఇలియానా మరోసారి నిరూపిస్తోంది. ఇంతకీ ఇలియానా ఏమంటుందో చూద్దాం. నాకు సినిమానే ప్రాణం అనిపిస్తుంది. అయితే అందులోనే పూర్తిగా మునిగిపోవద్దని నా మనసు చెబుతుంది. మనసు మాటే నేను వింటాను. అందుకే సినిమానే ప్రపంచం అని నేను భావించను. సినిమా వ్యామోహంతో ఎందరో అమ్మాయిలు ఇక్కడ సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వచ్చి ఊహించిన అవకాశాలు రాక తమ జీవితాలనే కోల్పోవడం నేను చూశాను.

అలాంటి వారి వల్ల నేను పరిణితి చెందాను కూడా. సినిమా రంగంలో ప్రణాళికలంటూ పెట్టుకోకూడదన్న విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అవకాశం వస్తే నటిస్తా. లేకున్నా బాధపడను. దక్షిణాది సినిమాల్లో ఏడేళ్లు నటిగా రాణించాను. ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించాను. దక్షిణాది చిత్రాల్లో నటించడం చాలా సులభం. ఇక్కడ మూడు, నాలుగు నెలల్లో చిత్ర నిర్మాణాలు పూర్తి చేస్తారు. హిందీలో అలా కాదు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా చాలా సయమం పడుతుంది. నాకిప్పుడు 30 ఏళ్లు. వయసు దాచుకోవలసిన అవసరం నాకు లేదు. అది ఒక సంఖ్య మాత్రమే.

నేనింకా 23 ఏళ్ల అమ్మాయి మాదిరిగా ఉన్నావని అభిమానులు అంటుంటే ఆనందం కలుగుతోంది. పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే నేనూ ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ ప్రేమించుకుంటున్నామని ప్రచారం జోరుగానే జరుగుతోంది. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అయితే ఆండ్రూ చాలా ఉన్నతమైన వ్యక్తి. తను నన్నూ ఉన్నతంగా మార్చారు. ఆండ్రూ నిజాయితీ నాకు నచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement