రావాలని ఉంది... | Actress Ileana Ready For A Come Back In Tollywood | Sakshi
Sakshi News home page

రావాలని ఉంది...

Published Sat, Mar 17 2018 12:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Ileana D’Cruz: If you speak out about casting couch, it will end your career - Sakshi

రావాలని ఉంది అంటున్నారు ఇలియానా. తెలుగు సినిమా ‘దేవదాసు’తో కథానాయిక అయ్యి, దాదాపు ఆరేళ్లు ఇక్కడ హవా సాగించారీ బ్యూటీ. సడెన్‌గా హిందీకి వెళ్లిపోయి, మళ్లీ వెనక్కి రాలేదు. నాలుగేళ్లుగా హిందీలో ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్నారు. ఆమె నటించిన ‘రైడ్‌’ శుక్రవారం విడుదలైంది. వాట్‌ నెక్ట్ప్‌? మళ్లీ హిందీ సినిమాయేనా? తెలుగులో చేసే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే – ‘తెలుగుకి రావాలని ఉంది. మంచి స్క్రిప్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. తెలుగులో నేను పెద్ద పెద్ద స్టార్స్‌ పక్కన పెద్ద సినిమాలు చేశాను. పెద్ద డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. మళ్లీ తెలుగులో చేస్తే అలాంటి బిగ్‌ ప్రాజెక్ట్సే చేయాలి. త్వరలో అలాంటి అవకాశం వస్తుందనుకుంటున్నా’ అన్నారు.

ఇంతకీ సౌత్‌ ఇండస్ట్రీ మీకేం నేర్పించింది అంటే – ‘నన్ను మంచి నటిని చేసింది. స్ట్రాంగ్‌ ఉమన్‌ని చేసింది. నటిగా ఎదుగుతూనే వ్యక్తిగా కూడా ఎదిగాను. నా ఆలోచనా పరిధిని పెంచింది. జీవితం అంటే ఏంటో నేర్పించింది. ఇక్కడ వచ్చిన పాపులార్టీ వల్లే హిందీ నుంచి పిలుపొచ్చింది. ఇంత చేసిన సౌత్‌ ఇండస్ట్రీకి దూరమవ్వాలని నేను అనుకోవడంలేదు. మళ్లీ సౌత్‌కి రావాలనుంది’ అని పేర్కొన్నారు ఇలియానా. మరి.. ‘రామ్మా’ అని ఇక్కణ్ణుంచి ఇలియానాను ఏదైనా అవకాశం పిలుస్తుందా? వేచి చూడాలి. సినిమాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకున్నారని వార్త వస్తున్నా ఇలియానా మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement