వారిద్దరు విడిపోయారా?! | Ileana unfollows Andrew Kneebone and deletes all pics | Sakshi
Sakshi News home page

ప్రియుడిని అన్‌ఫాలో చేసిన ఇలియానా!

Published Tue, Aug 27 2019 12:18 AM | Last Updated on Tue, Aug 27 2019 9:12 AM

Ileana unfollows Andrew Kneebone and deletes all pics  - Sakshi

ఇలియానా,అండ్రూ నీబోన్‌

‘ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’.. అంటూ ఇన్ని రోజులు ఒకరినొకరు ఫాలో అయ్యారు హీరోయిన్‌ ఇలియానా, ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌. చేతిలో చేతులు వేసుకుని ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట తాజాగా చేతులు దులుపుకుని విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి తొలగించారు ఇలియానా. అలాగే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకున్నారు.

దీంతో ఆమెకు, ఆండ్రూకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు నిజమేనని ఊహించుకోవచ్చు. ఇలియానా ఓ సందర్భంలో ఆండ్రూని ‘హబ్బీ’ (భర్త) అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి... ఈ బ్రేకప్‌ ప్రచారం గురించి ఇలియానా స్పందిస్తే కానీ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పడదు. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో ఇలియానా కథానాయికగా నటించిన ‘పాగల్‌ పాంతీ’ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement