
ఇలియానా
‘‘మనకు ఎవ్వరూ లేరనుకున్నప్పుడు, మనల్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతున్నారు అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనతో మనం ఉండగలగాలి’’ అని అర్థం వచ్చే ‘సెల్ఫ్ లవ్’ (మనల్ని మనం ప్రేమించుకోవడం) కొటేషన్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇలియానా. హఠాత్తుగా ఈ ‘సెల్ఫ్ లవ్’ వెనక కారణం ఏంటబ్బా? అంటే బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్పే కారణమయ్యుంటుంది అని ఊహిస్తున్నారు కొందరు. ఇటీవలే ఆండ్రూకి, ఇలియానాకు బ్రేకప్ జరిగిందట.
ఒకరినొకరు తమ సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవ్వడమే కాకుండా ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను డిలీట్ చేశారు కూడా. అందుకే సడెన్‌గా సెల్ఫ్ లవ్ గురించిన కొటేషన్లను ఇలియానా షేర్ చేస్తున్నారు అంటున్నారు కొందరు. ‘నీ జీవితం నుంచి ఎవ్వరు బయటకు వెళ్లిపోయినా నిన్ను నువ్వు మాత్రం కోల్పోవద్దు’, ‘కంట్లో నిప్పులు చెలరేగుతున్నా, స్వర్గంలాంటి చిరునవ్వు మాత్రం తనతోనే ఉంది’’ అంటూ పలు కొటేషన్లను షేర్ చేశారు ఇలియానా. ఈ విషయం ఇలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment