అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా | Ileana Tweets She Is Sleepwalking Snacker | Sakshi
Sakshi News home page

నేను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని: హీరోయిన్‌

Sep 16 2019 9:33 AM | Updated on Sep 16 2019 9:37 AM

Ileana Tweets She Is Sleepwalking Snacker - Sakshi

తాజాగా ఇలియానా చేసిన ఫన్నీ ట్వీట్‌ అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది.

తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో చెట్టాపట్టాలేసుకుని విహరించిన ఆమె..కొన్ని రోజుల కిత్రం అతడిని అన్‌ఫాలో చేయడంతో పాటు తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి తొలగించారు. దీంతో ఈ ప్రేమజంట విడిపోయిందనే నిర్ధారణకు వచ్చారు ఫ్యాన్స్‌. 

అంతేగాకుండా...‘మనకు ఎవరూ లేరనుకున్నప్పుడు, మనల్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతున్నారు అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనతో మనం ఉండగలగాలి’ అంటూ సెల్ఫ్‌ లవ్‌ కొటేషన్లతో ఇలియానా వేదాంత ధోరణిలో పోస్టులు పెట్టడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె చేసిన ఫన్నీ ట్వీట్‌ అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది. ‘ నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో. ఉందా. ఉండే ఉంటుంది. నా కాళ్లపై దర్శనమిస్తున్న గాయాలు, వాటి తాలూకు మచ్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది మరి. బహుశా ఫ్రిడ్జ్‌లో ఉన్న స్నాక్స్‌ తినేందుకు అర్ధరాత్రి ట్రిప్‌ వేశానేమో. నేనో స్లీప్‌వాకింగ్‌ స్నాకర్‌ని’ అని ఇలియానా ట్వీట్‌ చేశారు. అదే విధంగా..‘ నేనొక ‘మూర్ఖురాలిని’.. అంటే అర్ధరాత్రి స్నాక్స్‌ తినే పిచ్చిదానిని’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన అభిమానులు.. ఫన్నీ మీమ్స్‌తో ఆమెకు రిప్లై ఇస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం... ‘ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండటానికి.. అందరినీ ఆకర్షించడానికి ఇలా చేయడం ఇలియానాకు అలవాటే’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement