డేటింగ్‌ ప్రశ్నపై నటి దిమ్మతిరిగే రిప్లై | Ileana Strong Reply Over Dating With Andrew Kneebone | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ ప్రశ్నపై నటి దిమ్మతిరిగే రిప్లై

Published Thu, Jul 26 2018 1:57 PM | Last Updated on Thu, Jul 26 2018 8:55 PM

Ileana Strong Reply Over Dating With Andrew Kneebone - Sakshi

గోవా సుందరి, నటి ఇలాయానా తరచూ ఏదో ఓ పోస్టుతో సోషల్‌ మీడియాలో టౌక్‌ ఆప్‌ ది టౌన్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. విదేశీ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న ఇలియానా చాలారోజుల కిందట హబ్బీ అని పోస్ట్‌ చేసి, ఇటీవల పోస్ట్‌లో మాత్రం మై లవ్‌ అని సంబోధించారు నటి. తాజాగా ప్రియుడు నీబోన్‌తో డేటింగ్‌, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఇలాయానా చక్కటి బదులిచ్చారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఓ విదేశీయుడితో మీరు ఎందురు డేటింగ్‌ చేస్తున్నారు, అతడిని మీ జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ పోస్ట్‌ చేశారు. ‘ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి శరీర రంగు, జాతీయత (ఏ దేశం) లాంటి విషయాలు నాకు అనవసరం’ అంటూ ఇలియానా బదులిచ్చారు. ప్రేమ, పెళ్లి గురించి తనను అడిగిన ప్రశ్నకు నటి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారంటూ ఇలియానా ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు ఆండ్రూ నిబోన్‌తో వివాహం జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని మాత్రం ఎప్పటికప్పుడూ చాలా అందంగా దాటవేస్తున్నారు. రీల్‌ లైఫ్‌తో పాటు రియల్‌ లైఫ్‌ చాలా బాగుందని మాత్రం సెలవిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement