ఇలియానా ప్రేమలో పడిందా?
ఇలియానా ప్రేమలో పడిందా?
Published Sun, Jan 12 2014 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఇలియానా ప్రేమలో పడిందా? ఔనని కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ కోడై కూసింది. కానీ, ఇలియానా మాత్రం ఔననలేదు.. కాదనలేదు. తను ఔనన్నా, కాదన్నా.. ప్రేమలో పడిందని చాలామంది నిర్ధారణకు వచ్చేశారు. ఎందుకంటే, ఇటీవల ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ తన బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో కనిపిస్తోందట ఈ గోవా బ్యూటీ. ఓ రెస్టారెంట్‌లో కూర్చుని ఇద్దరూ గంటల కొద్దీ కబుర్లు చెప్పుకున్నారట. కప్ కేక్స్, బ్రెడ్ తింటూ కప్పుల మీద కప్పులు కాఫీ లాగిస్తూ ఈ ఇద్దరూ చాలామంది దృష్టిలో పడిపోయారు. ఇన్నాళ్లూ ఇంత బాహాటంగా తన ప్రియుడితో కనిపించని ఇలియానా ఇప్పుడీ విధంగా ప్రత్యక్షం కావడంతో.. నలుగురికీ తెలిస్తే తెలిసిందిలే అని ఆమె బలంగా ఫిక్స్ అయ్యుంటారని ఊహించవచ్చు. ఆండ్రూతో ఆమె ప్రేమ కచ్చితంగా పెళ్లి వరకూ వెళుతుందని కొంతమంది ఊహిస్తున్నారు. కానీ, బాలీవుడ్‌లో ఇలా గాఢంగా ప్రేమించుకుని, విడిపోయినవాళ్లు చాలామంది ఉన్నారని, ఇలియానా వ్యవహారం ఏమవుతుందో చూడాలని చెప్పుకుంటున్నారు.
Advertisement
Advertisement