మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్‌ | I can go on for 70 more years: Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్‌

Published Mon, Sep 11 2017 2:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్‌ - Sakshi

మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్‌

ముంబయి : తాను మరో 70 ఏళ్లు కూడా బాలీవుడ్‌ చిత్ర సీమలో ఉండగలనని ప్రముఖ నటి సోనాక్షి సిన్హా అన్నారు. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఆదివారంనాటికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విషయం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన అభిమానుల ద్వారానే ఇండస్ట్రీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. తొలిసారి దబాంగ్‌ చిత్రం (2010) ద్వారా సల్మాన్‌ఖాన్‌ సరసన నటిస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, నాయకుడు శత్రఘ్నసిన్హా కూతురు అయిన సోనాక్షి తొలినాళ్లలో నటించిన చిత్రాలు అన్నీ కూడా వరుసగా బంపర్‌ హిట్‌లు కొట్టిన విషయం తెలిసిందే.

దీంతో ఆమె బాలీవుడ్‌లో ఫేమస్‌ హీరోయిన్‌గా మారిపోయారు. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవడంతో ట్విట్టర్‌ ద్వారా తనకు దబాంగ్‌లో అవకాశం ఇచ్చిన సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, అభినవ్‌ కశ్యప్‌కు ధన్యవాదాలు చెప్పారు. అలాగే, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'నాపైన ప్రేమ చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. మరో 70 ఏళ్లు కూడా ముందుకు సాగగలనని చెప్పగలుగుతున్నానంటే అది మీవల్లే' అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement