హీరోయిన్‌ అరెస్ట్‌పై హైకోర్టు స్టే..! |  Allahabad High Court stays arrest of Sonakshi Sinha  | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో హీరోయిన్‌ అరెస్ట్‌పై హైకోర్టు స్టే..!

Mar 9 2019 8:39 PM | Updated on Apr 3 2019 6:23 PM

  Allahabad High Court stays arrest of Sonakshi Sinha  - Sakshi

లక్నో:  బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు గురిచేయ్యవద్దనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు వివరించింది. నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

సెప్టెంబర్‌ 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ. 37 లక్షలు తీసుకున్నారని,  చివరి నిమిషంలో ఈవెంట్‌రి ఆమె హాజరుకాలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. ఆమె రాకపోవడంతో తనకు భారీఎత్తున నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుని విచారించిన న్యాయముర్తి ఆమె అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement