బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
చదవండి: రాధేశ్యామ్ షూటింగ్‌లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే
దీనిపై నా స్టెంట్‌మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్‌లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది.
చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే..
కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment