మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు | Choreographer Remo DSouza His Wife And Five Others Booked In Fraud Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Remo D'Souza: డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతడి భార్యపైనా కేసు

Published Sun, Oct 20 2024 7:28 AM | Last Updated on Sun, Oct 20 2024 10:09 AM

Choreographer Remo DSouza His Wife Fraud Case

టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇతడి భార్యతో పాటు మరో ఐదుగురి కలిసే తనని మోసం చేశారని 26 ఏళ్ల డ్యాన్సర్.. ముంబైలోని మీరారోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

ఫిర్యాదు ప్రకారం.. డ్యాన్సర్ టీమ్ 2018-24 మధ్యలో టీవీ షోలో విజేతగా నిలిచింది. వీళ్ల గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్‌మనీని రెమో డిసౌజా తదితరులు తదమే అన్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ లాక్కున్నారు. రెమో డిసౌజాతో పాటు అతడి భార్య లీజెల్ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా ఉన్నారు.

వీళ్లపై డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. రెమో డిసౌజాతో పాటు మరో ఆరు మందిపై 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇతర సెక్షన్ల కింద కేసు మోదు చేశారు. ఇకపోతే రెమో డిసౌజా కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఫ్లయింగ్ జాట్, ఏబీసీడీ ఫ్రాంచైజీ, సల్మాన్ ఖాన్ 'రేస్ 3' సినిమాలతో దర్శకుడిగానూ అలరించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'హ్యాపీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏదేమైనా స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యిండి ఇలా చీటింగ్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement