ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్ | Salman Khan Buys New Bullet Proof Car Worth 2 Crores Amid Lawrence Bishnoi Threats, Deets Inside | Sakshi
Sakshi News home page

Salman Khan: ఇప్పటికే ఓ కారు.. అయినా సరే మరో కారు కొనుగోలు

Published Sat, Oct 19 2024 1:33 PM | Last Updated on Sat, Oct 19 2024 4:10 PM

Salman Khan Buys New Bullet Proof Car Worth 2 Crores

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్‌ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్‌ అప్రమత్తమయ్యాడు.

సుమారు రూ.2 కోట్ల విలువైన  బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్‌ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్‌ గ్యారేజ్‌లో చేరనుందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం.  అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.

ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement