ప్రస్తుత బిగ్‌బాస్ 8లో పాల్గొని రెండో వారానికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శేఖర్ భాషా. తాజాగా ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, విచారిస్తున్నారని న్యూస్ ఒకటి వైరల్ అయింది. హర్ష సాయిపై అత్యాచారం కేసులో భాగంగా ఇతడిని అదుపులోకి తీసుకున్నారని కామెంట్స్ వినిపించాయి. కానీ అలాంటిదేం లేదని, తనని అసలు అరెస్ట్ చేయలేదని శేఖర్ భాషా ఇప్పుడు వీడియో రిలీజ్ చేశాడు.
కొన్నిరోజుల క్రితం యూట్యూబర్ హర్షసాయిపై ఓ నటి, నిర్మాత కేసు పెట్టింది. తనని లైంగికంగా వేధించి, రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంలో పోలీసులు హర్షసాయి కోసం వెతుకుతున్నారు. మరోవైపు తనపై పలు ఇంటర్వ్యూల్లో శేఖర్ భాషా అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శేఖర్ భాషాని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి విచారించినట్లు న్యూస్ ఒకటి బయటకొచ్చింది.
(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)
అలాంటిదేం లేదని తాను ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లానని, తన ఫోన్ స్విచ్చాఫ్ అయిపోవడం వల్ల తాను అందుబాటులోకి రాలేకపోయానని చెప్పాడు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్స్ అని అన్నాడు. మరి నిజంగానే శేఖర్ భాషాని అరెస్ట్ చేశారా? లేదంటే ఈ పుకార్లు ఎందుకొచ్చాయనేది తెలియాల్సి ఉంది.
శేఖర్ భాషా ఓ రేడియో జాకీ. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు గానీ పెద్ద గుర్తింపు అయితే రాలేదు. రాజ్ తరుణ్-లావణ్య వివాదం జరుగుతుంటే మధ్యలో దూరి కాస్త ఫేమస్ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్ వచ్చాడు. రెండు వారాలు ఉన్నాడో లేదో ఎలిమినేట్ అయిపోయాడు. వైరల్ కావడం ఏ వివాదం జరుగుతుంటే అందులో దూరిపోతున్నాడా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?)
Comments
Please login to add a commentAdd a comment