ఈ వారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఓవర్ స్మార్ట్ అనే టాస్క్ నడుస్తోంది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అన్నంతలా బుధవారం గురువారం ఎపిసోడ్ నడిచాయి. ఇప్పుడు మెగా చీఫ్ ఎవరవుతారనే దానికోసం పోటీలు జరిగాయి. ఇందులో గౌతమ్ గెలిచాడు. కాకపోతే మణికంఠ చేసిన చిన్న తప్పు ఇతడికి ఈ పదవి వరించేలా చేసింది. నిఖిల్ గురించి గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో (అక్టోబర్ 18) ఏమేం జరిగిందనేది చూద్దాం?
(ఇదీ చదవండి: అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి)
తుస్సుమనిపించిన ఓజీ క్లాన్
ఓవర్ స్మార్ట్ టాస్క్ జరుగుతుండగానే బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న తలగడలు ఉంచారు. టీవీలో సింబల్ చూపించగానే అలాంటి తలగడని తీసుకెళ్లి మరోచోట గీసిన బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. తాను ఎంతమంది చెబితే అందరూ రావాలని, బాక్స్‌లో తలగడ పెట్టేంతవరకు అడ్డుకోవచ్చని ఒక్కసారి తలగడ పెట్టిన తర్వాత మాత్రం వ్యక్తిని తాకకూడదని క్లారిటీ ఇచ్చాడు. ఇందులో తొలి రెండుసార్లు ఓజీ క్లాన్ గెలిచింది. కానీ తర్వాత మాత్రం రాయల్ క్లాన్ పూర్తి ఆధిపత్యం చూపించింది.
నిఖిల్ డేంజర్ గాడు
ఈ టాస్క్‌లో గెలిచిన రాయల్ క్లాన్‌కి బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఓజీ క్లాన్‌లోని ఇద్దరిని మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయొచ్చని అన్నాడు. దీంతో ఓజీ క్లాన్ అంతా మాట్లాడుకుని నిఖిల్, నబీల్ అనుకున్నారు. గంగవ్వని పిలిచి అభిప్రాయం అడిగితే.. నిఖిల్ గాడిని తీసేయాలే, ఆడు పెద్ద డేంజర్ గాడు అని చెప్పింది. దీంతో అందరూ నవ్వేశారు. అలా నిఖిల్, నబీల్‌ని రేసు నుంచి తప్పించారు.
వాళ్లందరూ పోటీలో
అప్పటికే నిఖిల్, నబీల్, పృథ్వీ గేమ్‌లో ఔట్ అయిపోయారు. సరిగ్గా ఈ టైంలో ఓవర్ స్మార్ట్ టాస్క్ పూర్తయిందని ఈ ముగ్గురు తప్పితే మిగిలిన వాళ్లందరూ మెగా చీఫ్ కంటెండర్ పోటీకి అర్హులే అని బిగ్‌బాస్ ప్రకటించాడు. 'పట్టుకో లేదే తప్పుకో' పేరుతో టాస్క్ పెట్టాడు. దీని ప్రకారం ఓ రౌండ్ ప్లేస్‌లో కుక్క ఎముక బొమ్మ ఉంటుంది. బజర్ మోగినప్పుడు తొలుత ఎవరైతే పట్టుకుంటారో గేమ్ నుంచి మరొకరిని సరైన కారణం చెప్పి ఎలిమినేట్ చేయొచ్చని అన్నాడు. నిఖిల్‌ని సంచాలక్‌గా పెట్టాడు.
(ఇదీ చదవండి: పోలీసుల అదుపులో తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్!)
గౌతమ్ తెలివితేటలు
తొలిసారి బజర్ మోగిన వెంటనే అందరూ బోన్ మీద పడ్డారు. కానీ చివరకు గౌతమ్-మెహబూబ్ మాత్రమే దక్కించుకునేందుకు తెగ గింజుకున్నారు. చివరకు గౌతమ్ పట్టేసుకున్నాడు. అవినాష్-మెహబూబ్‌లనే తప్పిస్తున్నట్లు చెప్పాడు. వాళ్లు బలమైన కంటెస్టెంట్స్ అని, అందుకే ఎలిమినేట్ చేస్తున్నా అని కారణం చెప్పాడు. రెండోసారి మోగినప్పుడు అమ్మాయిలందరూ బోన్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ గౌతమ్ బలం ముందు వాళ్లు నిలబడలేకపోయారు. ఈసారి విష్ణుప్రియ-ప్రేరణని తప్పిస్తున్నట్లు చెప్పాడు.
మణికంఠ తప్పటడుగు
మూడోసారి బోన్ మణికంఠ చేతికి చిక్కింది. దీంతో గౌతమ్ పేరు చెబుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ టేస్టీ తేజ-హరితేజ పేర్లు చెప్పాడు. గేమ్ మొదలవకముందే గౌతమ్‌తో డీల్ మాట్లాడుకున్నానని అన్నాడు. అలాంటి డీల్ నేను ఫాలో కావట్లేదని గౌతమ్ ప్లేట్ తిప్పేశాడు. దీంతో మణికంఠ తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు. కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం తొలిసారి చెప్పిన పేర్లనే ఫైనల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా మణికంఠ తప్పు వల్ల గౌతమ్ బతికిపోయాడు. చివరకు ఒక్కొక్కరిని దాటుకుంటూ గౌతమ్ విజేతగా నిలిచాడు. మెగా చీఫ్ అయిపోయాడు.
అమ్మాయిలకు విశ్రాంతి
గౌతమ్ మెగా చీఫ్ కాగానే గంగవ్వ కాళ్లు మొక్కాడు. రోహిణి అయితే.. బొక్కలో లక్కు నీ వైపు ఉంది, అందుకే గెలిచావ్ అని ఫన్నీ సెటైర్ వేసింది. గత సీజన్‌లో చేసినట్లే ఈసారి కూడా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్‌కి వారం పాటు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేస్తారని చెప్పాడు. అలానే తన సహాయకులుగా హరితేజ-గంగవ్వని పెట్టుకుంటున్నట్లు చెప్పాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment