బిచ్చగాడిలా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా? | Kavin Bloody Beggar Movie Trailer Telugu | Sakshi
Sakshi News home page

'బ్లడీ బెగ్గర్'లా తమిళ హీరో.. టాలీవుడ్‌లో ఇలాంటి కథలు ఎప్పుడొస్తాయో?

Published Sat, Oct 19 2024 8:21 AM | Last Updated on Sat, Oct 19 2024 11:19 AM

Kavin Bloody Beggar Movie Trailer Telugu

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశారు. హిట్ కొట్టడంతో పాటు ప్రేక్షకుల మనసుల్ని కూడా గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రొటీన్ రొట్ట కొట్టుడు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా తీస్తున్నారు. కొద్దోగొప్పో పలువురు చిన్న హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. తాజాగా తమిళ యంగ్ హీరోని బిచ్చగాడు పాత్రలో పెట్టి ఏకంగా సినిమా తీసేశారు.

(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ))

తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న కవిన్.. రీసెంట్ టైంలో 'దాదా' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఇప్పుడు ఇతడిని హీరోగా పెట్టి 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ తీశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. బిచ్చగాడు పాత్రలో కనిపించిన సీన్స్ చూసి ఆశ్చర్యపోయారు. నిజం బెగ్గర్ ఏమో అనుకునేంతలా పరకాయ ప్రవేశం చేశాడనిపించింది.

దివ్యాంగుడిలా నటిస్తూ బిచ్చమెత్తుకుంటే జీవించే ఓ బెగ్గర్.. ఊహించని పరిస్థితుల్లో ఓ ఇంట్లో పెద్ద కుటుంబం మధ్యలో చిక్కుకుపోతే ఏం జరిగింది? చివరకు ఆ ఇంటినుంచి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. 'బీస్ట్', 'జైలర్' సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్.. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. కొన్నాళ్లకు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వస్తుంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement