బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ! | Bigg Boss 8 Telugu 7th Week Elimination Update: Is Hariteja And Tasty Teja In Danger Zone? Check Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 7th Week Elimination: ఈసారి ఎలిమినేట్‍ వేటు ఎవరిపై?

Oct 18 2024 9:12 AM | Updated on Oct 18 2024 10:30 AM

Bigg Boss 8 Telugu 7th Week Elimination Update

బిగ్‪‌బాస్ 8లో ఏడో వారం చివరకొచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో ఓవర్ స్మార్ట్ గేమ్ నడుస్తోంది. కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం కల్లా ఇది అయిపోతుంది. వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఎలిమినేషన్ టెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి ఓటింగ్‪‌లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఆరు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, నైనిక, ఆదిత్య ఓం, సీత ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, నబీల్, మణికంఠ, ప్రేరణ, యష్మి, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజ ఉన్నారు. గేమ్ పరంగా ఆకట్టుకుంటున్న నబీల్.. టాప్‍‌లో కొనసాగుతున్నాడట.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లిపోతా.. నిఖిల్ vs గౌతమ్)

ఓటింగ్ పరంగా నబీల్ తర్వాతి స్థానాల్లో వరసగా నిఖిల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, యష్మి, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. వీళ్లలో పృథ్వీపై సోషల్ మీడియాలో ఘోరమైన వ్యతిరేకత ఉంది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి చీప్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. అదే టైంలో ఇతడి ఆటని ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారని ఓటింగ్ చూస్తుంటే తెలుస్తోంది.

చివరి మూడు స్థానాల్లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్సే ఉన్నారు. వీళ్లలో టేస్టీ తేజ కాస్తోకూస్తో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గౌతమ్ అయితే యష్మితో మెల్లగా మాటలు కలుపుతూ లవ్ ట్రాక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్లిద్దరి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ఉన్నా లేనట్లే కనిపిస్తున్న హరితేజని ఇంటికి పంపించేస్తారా అనేది చూడాలి. 

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement