ఎన్టీఆర్ 'దేవర'తో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా రిలీజైంది. అదే 'సత్యం సుందరం'. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తీసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. కానీ 'దేవర' వల్ల ఎక్కువమందికి చూడలేకపోయారు. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధమైపోయింది.
'96' సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసిన లేటెస్ట్ మూవీ 'సత్యం సుందరం'. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.
(ఇదీ చదవండి: సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో)
అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేదే స్టోరీ.
ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమున్నవాళ్లు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.
(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)
Comments
Please login to add a commentAdd a comment