Aravind swami
-
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఎన్టీఆర్ 'దేవర'తో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా రిలీజైంది. అదే 'సత్యం సుందరం'. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తీసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. కానీ 'దేవర' వల్ల ఎక్కువమందికి చూడలేకపోయారు. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధమైపోయింది.'96' సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసిన లేటెస్ట్ మూవీ 'సత్యం సుందరం'. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.(ఇదీ చదవండి: సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో)అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేదే స్టోరీ.ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమున్నవాళ్లు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్
‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్లాగానే రాశాను. కార్తీ, అరవింద్ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. కార్తీ, అరవింద్ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. -
‘అందుకే దూరంగా ఉండాలనుకున్నాను’
అనుకోకుండా వచ్చిన స్టార్డమ్ నన్ను అణచివేసినట్లు అనిపించింది. అందుకే కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నాను అన్నారు విలక్షణ నటుడు అరవింద్ స్వామి. ‘రోజా’, ‘బాంబే’ వంటి చిత్రాల ద్వారా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారారు అరవింద్ స్వామి. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అరవింద స్వామి మణిరత్నం ‘కడలి’ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇండియా టూడే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అరవింద్ తన రీల్, రియల్ లైఫ్ ప్రయణాల గురించి ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనుకోకుండా నటున్ని అయ్యాను. కానీ స్టార్‌డమ్‌ని కోరుకోలేదు. అదే వచ్చింది. నేను హీరోగా కంటే నటుడిగా గుర్తింపబడాలని కోరుకున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు డబ్బు కోసం మోడలింగ్ చేసేవాడిని.. ఆ తరువాత ప్రకటనలు. అప్పుడు నన్ను చూసిన మణిరత్నం నాకు దళపతి సినిమాలో అవకాశం ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు. కొనసాగిస్తూ.. ‘ఆ తరువాత వచ్చిన ‘రోజా’, ‘బాంబే’ సినిమాలు నాకు స్టార్డమ్ తీసుకొచ్చాయి. దీనివల్ల నా మీద ఒత్తిడి పెరిగింది.. నా ప్రైవసీని కూడా కోల్పోయాను. ఈ స్టార్డమ్ నన్ను అణచివేస్తున్నట్లు అనిపించింది. ఇదంతా నాకు కొత్తగా, చాలా ఇబ్బందిగా తోచింది. రోజా తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలనుకున్నాను. అమెరికా వెళ్లాను. ఆ తర్వాత బిజినేస్ ప్రారంభించాను. 2005లో దాన్ని వదిలేశాను. అప్పటికే నేను సింగిల్ పేరెంట్‌ని. నా పిల్లల కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. సరిగా అదే సమయంలో నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఇన్నీ జరిగాయి.. కానీ మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి తిరిగి రావాలని అనుకోలేద’ని తెలిపారు. ఆ సమయంలో మణిరత్నం మళ్లీ నన్ను ‘కడలి’ సినిమాకోసం పిలిపించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి మాట్లాడుతూ.. ‘నేను నటున్ని. నటించడం మాత్రమే నా పని. మరేందుకు నా నుంచి రాజకీయాలను ఆశిస్తున్నారు. నటుడిగా ఏదైనా అంశాన్ని వెలుగులోకి తేగలను.. కానీ దానికి పరిష్కారం చూపలేను కదా’ అన్నారు. మీటూ గురించి అడగ్గా.. ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి దీని గురించి మాట్లాడలేను అంటూ సమాధానమిచ్చారు. -
రేపే ‘నవాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
చెలియా చిత్రం తరువాత మణిరత్నం దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం నవాబ్. భారీ మల్టిస్టారర్గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మణిరత్నం ఈసారీ అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణను ‘నవాబ్’ రూపంలో ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నవాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులందరూ హాజరుకాబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జయసుధ, జ్యోతిక తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
‘వరద’గా అరవింద్ స్వామి..
మణిరత్నం సినిమా అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను మలిచే విధానం ఆకట్టుకుంటుంది. మణిరత్నం సృష్టించే పాత్రలే సినిమాను నడిపిస్తాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన కడలి, చెలియా సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. మళ్లీ ఓ భారీ మల్టిస్టారర్ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘నవాబ్’గా తెలుగులో రాబోతోన్న ఈ మూవీలో అరవింద్ స్వామీ, శింబు, విజయ్ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రోజూ ఒక పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం ‘వరద’పాత్రకు సంబంధించిన అరవింద్ స్వామీ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు శింబు పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. #Nawab - Launching Star 2's look today at 5:00 PM. Any guesses?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan #SirivennelaSeetharamaSastry pic.twitter.com/pkOoGZLqAJ — Lyca Productions (@LycaProductions) August 14, 2018 -
‘నవాబ్’ను చూడబోతున్నాం!
మణిరత్నం రత్నాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం సినిమాల్లో నటిస్తే చాలనుకుంటారు హీరోలు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. జాతీయ స్థాయిలో మణిరత్నం సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలకు సరిహద్దులు ఉండవు. పాత్రల మధ్య భావోద్వేగాలే ఆయన కథను నడిపిస్తాయి. గత కొంతకాలం పాటు మణిరత్నం నుంచి వచ్చే సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. అయితే మళ్లీ మునుపటి మణిరత్నాన్ని తలపించేలా, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ‘నవాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వీరి మధ్య వచ్చే సంఘర్షణలే సినిమాకు కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్‌కు సంబంధించిన లుక్స్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. నేటి సాయంత్రం 5గంటలకు అరవింద్ స్వామి లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. #Nawab - Look 1 coming up at 5 PM today! Guess who?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan @sreekar_prasad #SirivennelaSeetharamaSastry pic.twitter.com/ii5tPgqtrg — Lyca Productions (@LycaProductions) August 13, 2018 -
భారీ మల్టీస్టారర్.. మొదలవుతోంది
సాక్షి, చెన్నై : పుకార్లకు పుల్ స్టాప్ పడిపోయింది. క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించేశారు. చిత్ర తారాగణంతోపాటు వారి టైటిల్ లోగోను కూడా విడుదల చేసేశారు. తమిళ్లో ‘చెక్క చివంత వానమ్’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ గా రానుంది. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి పేర్లను ఇది వరకే ప్రకటించగా... ఇప్పుడు అదనంగా అరుణ్ విజయ్(బ్రూస్ లీ ఫేమ్) జత కలిశాడు. ముందుగా మళయాళ నటుడు పహద్ ఫజిల్ పేరు అనుకున్నప్పటికీ.. డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్లేస్‌లో అరుణ్ విజయ్ను తీసుకున్నారు. జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావ్ హైదరి, డయానా హీరోయిన్లుగా.. ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్, జయ సుధ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ హౌజ్ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. #NAWAB @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad #SeetharamaSastry @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/uDk420IwgC — Lyca Productions (@LycaProductions) February 9, 2018 #CCV #ManiRatnam @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad @vairamuthu @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/VaIk6EUxPc — Lyca Productions (@LycaProductions) February 9, 2018 -
నరకాసురన్‌లో అరవిందస్వామి
అరవింద్ స్వామి కొద్ది గ్యాప్ తరువాత విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. తనీఒరువన్( ధృవ తెలుగులో) చిత్రంలో ఆయన స్టైలిష్ విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే చతురంగవేట్టై-2 చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇపుడు నరకాసురన్ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. దృవంగళ్ 16 చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దీన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అరవిందస్వామితోపాటు శ్రియ, సందీప్‌కిషన్ ఎంపికయ్యారు. తాజాగా యువ నటి ఆద్మికను ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్ నరేన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆద్మిక వీసైమురుక్కు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ అమ్మడికిప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయట. అందులో ఒకటి నరకాసురన్. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయట. సెప్టెంబర్ 16న చిత్ర షూటింగ్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు, అక్కడే 40 రోజులపాటు చిత్రీకరణ జరగుతోందని దర్శకుడు తెలిపారు.