
నవాబ్ చిత్రం లోగో లాంఛ్ పోస్టర్
సాక్షి, చెన్నై : పుకార్లకు పుల్ స్టాప్ పడిపోయింది. క్లాసిక్ చిత్రాల దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్‌ను అధికారికంగా ప్రకటించేశారు. చిత్ర తారాగణంతోపాటు వారి టైటిల్ లోగోను కూడా విడుదల చేసేశారు.
తమిళ్‌లో ‘చెక్క చివంత వానమ్’ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ గా రానుంది. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి పేర్లను ఇది వరకే ప్రకటించగా... ఇప్పుడు అదనంగా అరుణ్ విజయ్(బ్రూస్ లీ ఫేమ్) జత కలిశాడు. ముందుగా మళయాళ నటుడు పహద్ ఫజిల్ పేరు అనుకున్నప్పటికీ.. డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్లేస్‌లో అరుణ్ విజయ్‌ను తీసుకున్నారు.
జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అదితి రావ్ హైదరి, డయానా హీరోయిన్లుగా.. ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్, మన్‌సూర్ అలీఖాన్, జయ సుధ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ హౌజ్ వారు సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
#NAWAB @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad #SeetharamaSastry @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/uDk420IwgC
— Lyca Productions (@LycaProductions) February 9, 2018
#CCV #ManiRatnam @LycaProductions @arrahman @santoshsivan @sreekar_prasad @vairamuthu @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj @salamsir21 #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @dhilipaction @ekalakhani @onlynikil pic.twitter.com/VaIk6EUxPc
— Lyca Productions (@LycaProductions) February 9, 2018
Comments
Please login to add a commentAdd a comment