
సంచలనానికి మారుపేరు నటుడు శింబు. ఈయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా అభిమానులు మాత్రం తలకెక్కించుకుంటారు. ఇకపోతే శింబు ఇటీవల వరుస విజయాలతో మంచి జోరులో ఉన్నారు. మహానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా పత్తు తల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
నటి ప్రియా భవాని శంకర్ కథానాయకి. గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్ర పోషించారు. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియో సంస్థలు నిర్మిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా తాజాగా శింబు 40వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అభిమానుల్లో పండగ వాతావరణమే నెలకొంది. శింబు ఫొటోలతో ఎస్టేక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొత్తుల చిత్రంలోని నమ్మి సత్తం అనే లిరికల్ వీడియోను ఏఆర్ రెహా్మన్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment